Bobby Simha: సలార్ హైప్ మరింత అధికం చేసాడు

ప్రశాంత్ నీల్… కేజిఎఫ్ సినిమా రిలీజ్ అయినంతవరకు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కే జి ఎఫ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కేజీఎఫ్ సినిమా సాధించిన విజయం అలాంటిది. కే జి ఎఫ్ సినిమాలో ప్రశాంత్ నీల్ యష్ ను చూపించిన విధానం ఆ సినిమా కథ ఆ స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఒక రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి.

ఇకపోతే ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో కూడా అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. అయితే బాలీవుడ్ లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ తగ్గింది.

ఇకపోతే ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక ఎపిక్ లవ్ స్టోరీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా కొంచెం స్లోగా ఉండటం ప్రభాస్ సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఉండకపోవటం ఈ సినిమాని డిజాస్టర్ పాలు చేశాయి.

- Advertisement -

ఈ సినిమా తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాను చేశాడు ప్రభాస్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా కొంతమేరకు ట్రోల్ కు కూడా గురైంది అని చెప్పొచ్చు. రామాయణాన్ని బాగా తీయలేదు అనే విమర్శలు కూడా చాలామంది చేసారు.

ఇకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక విముక్తిని తీసుకొచ్చిన సినిమా అంటే సలార్ అని చెప్పాలి. చాలా రోజుల నుంచి ప్రభాస్ లో మిస్ అవుతున్న ఒక కమర్షియల్ యాంగిల్ ని బయటకు తీశాడు ప్రశాంత్ నీల్. అయితే ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు. అయితే సలార్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ పది నిమిషాలు మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

ఇకపోతే సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహ వంటి పెద్ద పెద్ద నటులు నటించారు. రీసెంట్ గా బాబీ సింహ సలార్ 2 సినిమా గురించి మరో అప్డేట్ ను రీవీల్ చేశారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుందని, ఈ సినిమా సలార్ ను మించి 100 రెట్లు అద్భుతంగా ఉండబోతుందని బాబీ సింహ చెప్పుకొచ్చాడు. ఈ న్యూస్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో జోష్ నింపుతుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు