ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు బుల్లితెరపై సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు తమ వివాహాలను ప్రకటిస్తూ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెండితెర పై.. వరుణ్ తేజ్ – లావణ్య, దగ్గుబాటి అభిరామ్ – ప్రత్యూష వివాహాలు చేసుకోగా.. ఇటు బుల్లితెరపై మానస్ కూడా వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అయ్యారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 వాసంతి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా తిరుపతిలోని ఒక ఫంక్షన్ హాల్లో గురువారం రోజున తన బాయ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ తో నిశ్చితార్థం చేసుకుంది.
ఈ వేడుకను ఇరు కుటుంబ సభ్యులతో పాటు బుల్లితెర నటీనటుల మధ్య చాలా ఘనంగా నిర్వహించారు. వీరంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. ఇకపోతే వాసంతి నిశ్చితార్థ వేడుకలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన గీతూ, అర్జున్ కళ్యాణ్ , ఆర్ జె సూర్య, సత్య, ఇనయ తదితరులు సందడి చేశారు. అంతే కాదు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక వాసంతి విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
ఈమె అసలు పేరు వాసంతి కృష్ణన్.. తిరుపతికి చెందిన అమ్మాయి. మోడల్‌గా కెరియర్ను మొదలుపెట్టి సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన క్యాలీఫ్లవర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాలో కూడా నటించిన ఈమె అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం రావడంతో అక్కడ అడుగుపెట్టి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి అలరించింది.
అంతే కాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది వాసంతి.