Aryan Khan: బాలీవుడ్ బ్యూటీతో షారుఖ్ కొడుకు

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీ టౌన్ ను షేక్ చేస్తున్నాయి. బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ చేసిన అందాల భామ నోరా ఫతేహీతో ఆర్యన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఫ్యాన్స్ కూడా ఇందుకు గట్టి ఆధారాలే ఉన్నాయంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి ప్రేమ కథలకు కొరతే లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు, స్టార్లు డేటింగ్ వార్తలతో మీడియాలో హల్చల్ చేశారు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ కొడుకు కొత్త ప్రేమ కథ బాలీవుడ్ లో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆర్యన్ ఖాన్ – నోరా దుబాయ్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా.. నోరా ఫతేహి కి 30 ఏళ్లు.

అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఆర్యన్ వయసులో చిన్నవాడే అయినా నోరాకు, తనకు ఐదేళ్ల వ్యత్యాసం ఉన్నప్పుడు వారిద్దరూ ప్రేమలో పడడం పెద్ద విషయమేమీ కాదని కొంతమంది నెటిజన్లు వారికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్, నోరాతో డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్ లో ఈ విషయం వైరల్ కావడంతో బాలీవుడ్ కి చెందిన కొందరు ప్రముఖులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అందరూ బాలీవుడ్ నటులు ఒకే దగ్గర కలుస్తుంటారని.. అలాంటప్పుడు వారిద్దరూ ఒకే చోట ఉండడంతో డేటింగ్ లో ఉన్నారు అనుకోవడం పొరపాటేనని అంటున్నారు. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్ లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు