Allu Ayaan: వైరల్ గా మారిన అల్లు అయాన్ జాతకం.. సినిమాల్లోకొస్తే జరిగేదదే..!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్ లు.. తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీకి తమ వారసులను పరిచయం చేయగా.. ఇక వారు కూడా తమ తల్లిదండ్రుల నటన పరంపరను కొనసాగిస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు గా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈయన వారసుడిగా అల్లు అయాన్ కూడా ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అల్లు అయాన్ కి సంబంధించిన జాతకం ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులకు అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. అర్హ అయితే ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సమంత హీరోయిన్గా వచ్చిన శాకుంతలం సినిమా ద్వారా భరతుడి క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను అలరించింది .ఇక పెద్దయిన తర్వాత కూడా ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే అయాన్ మాత్రం ఇప్పటివరకు సినీ రంగ ప్రవేశం చేయలేదు.

ఇలాంటి సమయంలోనే ఆయన సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.మరి ఏమిటో వార్త అంటే అయాన్ జాతకం ప్రకారం సినిమా ఇండస్ట్రీ లోకి రారు అని.. ఒకవేళ వస్తే సక్సెస్ కారు అని ఆయన జాతకరీత్యా రాజకీయ రంగంలోనే ఆయన సెటిల్ అవుతారని.. తప్పకుండా అల్లు అయాన్ కి రాజకీయంగా బాగా కలిసి వస్తుందని ఒక వార్త ఇప్పుడు నెట్టింట చాలా హల్చల్ చేస్తోంది. అయితే ఇది విన్న చాలా మంది నెటిజన్ లు అయాన్ ఇంకా పది సంవత్సరాల కుర్రాడే.. అలాంటి ఇతడి భవిష్యత్తు గురించి అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది స్టార్ హీరో కొడుకు అయి ఉండి ఇండస్ట్రీలోకి రాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు