Ahimsa: ఫ్రీగా ఇస్తామన్నా పట్టించుకునేవారు లేరా..?

రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ డైరెక్షన్లో రూపొందిన అహింస సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజయ్యిందో కూడా మందికి తెలీదని చెప్పాలి. తేజ కెరీర్లో చాలా డిజాస్టర్స్ ఉన్నప్పటికీ ఇంత వరస్ట్ టేకింగ్ ఉన్న సినిమా అయితే లేదని చెప్పాలి.
సాధారణంగా థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలకు ఓటీటీలో అంతో ఇంతో రేట్ కుదురుతూ ఉంటుంది. అహింస సినిమాకు మాత్రం ఓటీటీలో అస్సలు డిమాండ్ లేదు. ఈ సినిమాను కొనేందుకు ఏ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
ఇక ఓటీటీ రైట్స్ మీద ఆశలు వదులుకున్న మేకర్స్ ఈ సినిమాను ఫ్రీగా ఇచ్చేందుకు సిద్దమైనప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదని టాక్ వినిపిస్తోంది. పెద్ద ఫ్యామిలీ నుండి ఇంట్రొడ్యూస్ అయిన హీరో సినిమాకి ఈ దుస్థితి రావటం పట్ల సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో డైరెక్టర్ తేజ స్పీచ్ తోనే అర్థమయ్యింది ఈ సినిమాలో విషయం లేదని.
అసలే కంటెంట్ లేని సినిమా, ఆపై స్వయంగా డైరెక్టరే సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేయటంతో అహింస సినిమా పాడెక్కింది. అభిరామ్ నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాలంటేనే భయపడేలా చేసింది అహింస సినిమా. మరి, నెక్స్ట్ సినిమా చేసే సాహసం ఇప్పట్లో చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు