సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఆ తర్వాత రాబోయే సినిమాలపై అభిమానులు ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అయితే అందులో అన్నిటికంటే ముందు టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న “తలైవర్170″ మీదే అందరి కన్ను ఉంది. జై భీమ్ తర్వాత జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండడం వల్ల ఈ రేంజ్ హైప్ ఉంది. అదీ గాక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఫైనల్ కాగా, మరో పాత్ర కోసం శర్వానంద్ ని సంప్రదిస్తున్నట్టు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా ఈ బడా ప్రాజెక్ట్ లో టాలీవుడ్ ‘హల్క్ దగ్గుపాటి రానా’ నటిస్తున్నాడంటూ మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇక రానా ఎంట్రీ తో సినిమా మీదున్న హైప్ మరింత పెరిగి పోయిందని చెప్పొచ్చు. మామూలుగా రానా తన పెరఫార్మన్స్ తో ఇరగదీస్తాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలతో నటించిన రానా రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల తన ఫాలోయింగ్ ని మరింత పెంచుకునే అవకాశము ఉంది.
ఇక ఈ సినిమాలో నాని లేదా శర్వానంద్ నటిస్తున్నాడంటూ, ఆ రోల్ నెగిటివ్ రోల్ ఉండవచ్చంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రానాకి వచ్చిన రోల్ అదే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమా 2024 సమ్మర్ కల్లా పూర్తవుతుందని మేకర్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రితికా సింగ్, మంజు వారియర్, దూషార విజయన్ కీలకపాత్రల్లో నటిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తలైవర్170 సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో శుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News