BigBoss season7: ఆఖరికి నాగార్జున కూడా చెప్పాడు.. ఇప్పుడైనా ఆ తప్పు సరిదిద్దుకుంటాడా?

BigBoss season7:

తెలుగు టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 సందడి మొదలైనప్పటి నుండి స్టార్ మా టిఆర్పి రేటింగ్స్ ఊపందుకున్నాయి. సీరియల్ బ్యాచ్ కూడా ఈ షో కి కనెక్ట్ అయిపోయి తెగ చూసేస్తున్నారు. అయితే ఈ సీజన్ గత సీజన్ల లా కాకుండా అంతా ఉల్టా పల్టా గా సాగుతుందని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో ఎవరికీ వారు తమ తమ పెర్ఫార్మన్స్ తో అదరగొడుతుండగా, కొందరు మాత్రం ఇంకా తమ ఒరిజినాలిటీ లోని లోపాలతో కంటెస్టెంట్స్ ని విసిగిస్తున్నారు. వాళ్ళు ఆట పరంగా బాగానే ఆడుతున్నా, ఒక్కోసారి తమ దురుసు ప్రవర్తనతో ఆడియన్స్ లో అలాగే కంటెస్టెంట్స్ లో బ్యాడ్ అవుతున్నారు.

అలాంటి వాళ్లలో ఆఫర్ దీప్, ప్రశాంత్, యావర్, టేస్టీ తేజ ఎక్కువగా వినిపిస్తుంటారు. వీళ్ళలో ప్రిన్స్ యావర్ ఎక్కువగా తన లోపాన్ని బయటికి ప్రదర్శిస్తున్నాడు. అదే కోపం. ప్రిన్స్ ఆట పరంగా ఇప్పటివరకు అందరి కంటే ఎక్కువ టాస్క్ లు నిజాయితీగా ఆడినా, అందులో కొన్ని గెలిచినా, తనకి పవర్ అస్త్ర దక్కలేదు. అందులో తాను తెలుగులో మాట్లాడకపోవడం ఒక కారణం అయితే, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తొందరగా అర్ధం చేసుకోకపోవడం మరో కారణం. అన్నిటికి మించి తన విషయంలో ఏదయినా మిస్టేక్ జరిగితే వెంటనే యాంగ్రీ అయిపోతాడు. దీని వల్ల ఒక్కోసారి కంటెస్టెంట్స్ భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

అందుకే ఈవారం నాగార్జున అందరికి కోటింగ్ ఇస్తూ, ప్రిన్స్ యావర్ ని కూడా వేసుకున్నాడు. కంటెస్టెంట్స్ టాస్క్ లో భాగంగా ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే గొడవ కూడా పడతారు. అలాంటి టైం లో నువ్వు నిన్ను ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బాగా ఆడియన్స్ దృష్టిలో టాప్ లో నిలుస్తావు అని అన్నాడు. యావర్ దానికి ఒప్పుకొని ఇక ముందు నుండి కరెక్ట్ గా ఉంటాను సార్, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను అన్నాడు. మరి కంటెస్టెంట్స్ ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేని, యావర్ నాగార్జున చెప్పినప్పుడైనా అర్ధం చేసుకొని గేమ్ లో ముందుకు వెళ్తాడా అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు