Game Changer : ఇక దిల్ రాజు ఆశలన్నీ చరణ్ మీదే!

Game Changer : టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా పేరున్న నిర్మాత ఎవరూ అంటే అందరూ చెప్పే మాట దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాత గా మారి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఈయన టాలీవుడ్ లో జడ్జిమెంట్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతకు మించిన తెలివైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. ప్లాప్ అయ్యే సినిమాలని కూడా తన ప్రమోషన్ల తో గట్టెక్కించిన ఘనుడు నిర్మాత దిల్ రాజు. ఒక రకంగా స్క్రిప్టు దశలోనే ఆయన సినిమా ఫలితాన్ని అంచనా వేయగలడని అంటారు. అందుకే 20 ఏళ్లకు పైగా మంచి సక్సెస్ రేట్‌తో కొనసాగుతూ పెద్ద రేంజికి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాం ఏరియా అంటే దిల్ రాజు అడ్డా అని అంటారు. నైజాం లో ఒకప్పుడు ఏ పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్ అయినా అది దిల్ రాజు చేతికే వెళ్ళేది. ఇక ఇప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్ల రాకతో డిస్ట్రిబ్యూటర్ గా తక్కువ సినిమాలనే కొంటున్నాడు. ఎక్కువగా సినిమాల నిర్మాణం మీదే దృష్టి పెట్టాడు. కానీ ఈ మధ్య రాజు జడ్జిమెంట్ తేడా కొడుతోంది. ప్రొడ్యూసర్‌గా ఆయన తరచుగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు.

వరుస ప్లాపులతో దిల్ రాజు డీలా ?

దిల్ రాజు ఈ మధ్య ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు గాని తీవ్ర నష్టాలు మిగిల్చాయి. గత రెండేళ్లలో థ్యాంక్యూ, శాకుంతలం, అంతకు ముందు రౌడీ బాయ్స్, లేటెస్ట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎంత పెద్ద నిర్మాత అయినా వరుస ఫెయిల్యూర్లు వస్తే తట్టుకుని నిలబడడం కష్టం. దిల్ రాజు కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్న విషయం లేటెస్ట్‌గా మీడియాతో మాట్లాడినపుడే అర్థమైపోయింది. వీకెండ్ లో వసూళ్లు బాగా డ్రాప్ అయిపోవడం దిల్ రాజును తీవ్ర సందిగ్థత లో పడేసినట్లు కనిపిస్తోంది. ఇక నిర్మాతగా రాజుకు వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో ఆయనకు ఒక భారీ విజయం అవసరం. దీంతో ఆయన ఆశలన్నీ ఇక ‘గేమ్ చేంజర్’ మీదే నిలవనున్నాయి.

దిల్ రాజు ఆశలన్నీ చరణ్ సినిమా పైనే?

అయితే దిల్ రాజు తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. దిల్ రాజు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కిన సినిమాకాగా, రామ్ చరణ్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతుండడం వల్ల భారీ అంచనాలున్నాయి. అయితే చిత్రీకరణ బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ పరిధి దాటేసింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే 40 శాతం అదనంగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అసలే దిల్ రాజుకు చాన్నాళ్లుగా సరైన సక్సెస్ లేదు. పైగా బడ్జెట్ బాగా ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో ‘గేమ్ చేంజర్’ పెద్ద హిట్ అయి తీరాల్సిందే. ఇది ఏమాత్రం అటు ఇటు అయినా రాజుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదే విధంగా దిల్ రాజు ట్రాక్ లో పడడానికి కూడా ఈ సినిమానే హెల్ప్ అవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, అందునా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కాబట్టి ఏ రేంజ్ లో బిజినెస్ ఉంటుందో తెలిసిందే. అందుకే దిల్ రాజు రామ్ చరణ్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో చరణ్ రాజుకు ఎలాంటి హిట్టిస్తాడో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు