Yuvan Shankar Raja : ఇన్స్టా అకౌంట్ డిలీట్… అసలు సమస్య ఇదేనంటూ రియాక్ట్ అయిన యువన్

Yuvan Shankar Raja : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తనయుడు, ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన శంకర్ రాజా ఈరోజు మధ్యాహ్నం ఇన్స్టా ఎకౌంట్ డిలీట్ చేశాడనే వార్త సంచలనం సృష్టించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన విజిల్ పొడు పాటకు వచ్చిన నెగిటివిటీ కారణంగానే ఆయన అప్సెట్ అయ్యి ఇలా చేశారంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే యువన్ స్పందిస్తూ తాను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయడం వెనక ఉన్న రీజన్ ఏంటో వెల్లడించారు. మరి ఇంతకీ ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే…

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ది గోట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. విజిల్ పోడు అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఆ పాటకు పెద్ద ఎత్తున నెగెటివిటీ వచ్చింది. ఇలాంటి అవుట్ డేటెడ్ సాంగ్స్ ఇస్తున్న యువన్ ను పక్కన పెట్టేయాలని, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ఈ సినిమాకు తీసుకోవాలని విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. పైగా యువన్ శంకర్ రాజాపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే యువన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ కావడం అనుమానాలకు తెర తీసింది. ఈ తీవ్రమైన నెగెటివిటీ కారణంగా బాధ పడ్డ యువన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేశారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ తాజాగా ఈ విషయం గురించి స్పందించిన యువన్ శంకర్ రాజా అందరూ అనుకుంటున్న విధంగా ఈ ట్రోలింగ్ కారణంగా తను ఇంస్టాగ్రామ్ ఎకౌంట్న ను డిలీట్ చేయలేదని వెల్లడించారు. ఏదో టెక్నికల్ ఎర్రర్ కారణంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయినట్టుగా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన యువన్ హే గైస్ మీరందరూ పంపిస్తున్న మెసేజ్ లకు థాంక్స్. ఇదొక చిన్న టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. మా టీం నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలోనే నేను మళ్ళీ ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తాను. లవ్ యు ఆల్వేస్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన కావాలని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయలేదనే విషయంపై క్లారిటీ వచ్చింది. మొత్తానికి టెక్నికల్ ఎర్రర్ వల్ల కనిపించకుండా పోయిన యువన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కారణంగా విజయ్ అభిమానుల మీద పెద్ద నిందే పడింది. మరి నెక్స్ట్ సాంగ్ తోనైనా యువన్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంటారా అనేది చూడాలి.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన హాట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ది గోట్ మూవీని సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు