Pooja Hegde: ప్రేమలో పడ్డ పూజా.. ఎవరితో తెలిస్తే షాక్..!

Pooja Hegde.. ప్రముఖ సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ తన ప్రియుడితో రొమాన్స్ లో మునిగితేలుతున్నట్లు సమాచారం. అయితే ఈమె ఎవరితో ప్రేమలో పడింది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. అతను ఎవరో కాదు హిందీ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్, సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రా తో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Pooja Hegde: Pooja fall in love.. he is the person..!
Pooja Hegde: Pooja fall in love.. he is the person..!

రోహన్ మెహ్ర తో ప్రేమాయణం..

గత కొన్నాళ్లుగా పూజా హెగ్డే రోహన్ మెహ్రాతో చట్టపట్టలేసుకొని మీడియా కంట పడుతోంది. ఈ క్రమంలోని బుధవారం పూజ హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్ కి రాగా అక్కడ పూజాహెగ్డే ఫ్యామిలీతో పాటు రోహన్ మెహ్రా కూడా రెస్టారెంట్లో దర్శనమిచ్చారు. అంతేకాదు పూజా హెగ్డే ఫ్యామిలీతో కలిసి ఈయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. మొత్తానికైతే ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి…

కుటుంబ సభ్యులకు పరిచయం చేయడం కోసమే..

ప్రస్తుతం పూజా హెగ్డే రోహన్ తో డేటింగ్ లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా పూజా హెగ్డే కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ కూడా నెట్టింట కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు.. ఇక రోహన్ ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడం కోసమే పూజా హెగ్డే హోటల్లో అలా ప్లాన్ చేసిందని సమాచారం.. ముఖ్యంగా కామన్ ఫ్రెండ్ ద్వారా ఇతడితో పరిచయం ఏర్పడిందట.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టు సమాచారం. మొత్తానికైతే తన బాయ్ ఫ్రెండ్ ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

రోహన్ మెహ్ర కెరియర్..

పూజా హెగ్డే కొత్త బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రా కెరియర్ విషయానికి వస్తే.. ఇతను హిందీలో పలు టీవీ సీరియల్స్ తో పాటు రియాల్టీ షోలు కూడా చేశారు. గుమ్రా ఎండ్ ఆఫ్ ఎన్నోసెన్స్ సీరియల్ తో నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఏ హై ఆషిఖీ , ఏ రిష్తా క్యా కెహ్లతా హై, ససురాయ్ సిమర్ కా వంటి సీరియల్స్ చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు.. అలాగే బిగ్ బాస్ 10 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన సత్తా చాటారు.. ఫైనల్ చేరుకున్న ఇతడు ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నారు.. ఇక బిగ్ బాస్ 11, కిచెన్ చాంపియన్, లాకప్ వంటి షోలలో గెస్ట్ గా చేశారు. అంతేకాదు కాదు హిందీ మ్యూజిక్ వీడియోలతో బాలీవుడ్ ఫ్యాన్స్ కి బాగా సుపరిచితుడే.. బుల్లితెరపై స్టార్ గా కొనసాగుతున్న ఈయన వెండితెరపై మాత్రం ఆశించినంత గుర్తింపు అందుకోలేదు.. హిందీలో కేవలం మూడు సినిమాల చేసినా మూడు కూడా డిజాస్టర్ గా నిలిచాయి..

పూజ హెగ్డే కెరియర్..

తెలుగులో చివరిగా ఎఫ్ త్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈమె మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించలేదు.. ఇక బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరో గా దేవా అనే సినిమా చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు