Raja Saab Update : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా… సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Raja Saab Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల అప్డేట్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా కల్కి రిలీజ్ డేట్ గురించి, రాజా సాబ్ మూవీ అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి ఈవెంట్ లో కూడా రాజా సాబ్ మూవీకి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి నిర్మాతలకు. ఈ నేపథ్యంలోనే తేజ రెబల్ స్టార్ అభిమానుల దిల్ ఖుషీ చేసే అప్డేట్ ఇచ్చాడు. రాజా సాబ్ మూవీ నుంచి సాంగ్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయాన్ని బయట పెట్టారు.

తేజ నోట రాజా సాబ్ అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రానేలేదు. అప్పుడే రాజా సాబ్ మూవీపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది ఆయన అభిమానులకు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న కల్కి మూవీని పక్కన పెట్టి రాజా సాబ్ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్నారు. సినిమాపై భారీగా అంచనాలు ఉండడంతో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. కానీ డైరెక్టర్ మారుతీ మాత్రం సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇటీవల బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ మ్యూజిక్ సింబల్స్ పెట్టి ట్వీట్ చేయగా, డైరెక్టర్ మారుతి స్మైల్ సింబల్ తో రిప్లై ఇచ్చి కొత్త రూమర్లకు తెర తీశారు. వీరిద్దరి సోషల్ మీడియా సిగ్నస్ చూశాక త్వరలోనే సాంగ్ రిలీజ్ కాబోతోందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం దీని గురించి స్పందించలేదు. కానీ తాజాగా జరిగిన మిరాయి ఈవెంట్లో తేజ సజ్జ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీకి సంబంధించిన రెండు అప్డేట్లు ఇచ్చారు.

- Advertisement -

మిరాయి ఈవెంట్లోనే హింట్

తాజాగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరగగా, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ను రాజా సాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి ప్రశ్నించారు. అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాతే రాజా సాబ్ నుంచి అప్డేట్స్ వస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే మైక్ అందుకున్న తేజ మాట్లాడుతూ త్వరలోనే రాజా సాబ్ నుంచి సాంగ్ వస్తుందని డౌట్ గా ఉందండి అంటూ రిప్లై ఇచ్చారు. ఆ మాటకు ప్రొడ్యూసర్ నవ్వేసి ఊరుకున్నారు. దీంతో మొత్తానికి మరోసారి రాజా సాబ్ నుంచి త్వరలోనే ఓ పాట రిలీజ్ కాబోతుందని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. రాజా సాబ్, మిరాయి సినిమాలను పీపుల్ మీడియా బ్యానర్ నిర్మాతలే నిర్మిస్తున్నారు.

ఓవైపు సైలెంట్ గా కల్కి షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిధి అగర్వాల్, ప్రభాస్ పై ఓ అదిరిపోయే మాస్ బీట్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే సెట్స్ లో ప్రభాస్ లుక్ కు సంబంధించిన వీడియో లీకై వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు