Cobra : ఆడియో ఫంక్షన్ కు విక్రమ్

శుక్రవారం అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఒకే వార్త. తమిళ స్టార్ హీరో విక్రమ్ కు గుండె పోటు. కావేరి ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉంది. ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో సినీ లవర్స్, చియన్ విక్రమ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు.

అయితే, హీరో విక్రమ్ కు గుండె పోటు రాలేదని, విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ అధికారిక ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గినా, ఎక్కడో తెలియని భయం ఉండేది. కానీ, కావేరి ఆస్పత్రి వర్గాలు విక్రమ్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అది గుండె పోటు కాదని, ఛాతీలో చిన్న పాటి నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేరారని హీరో విక్రమ్ మేనేజర్ కూడా ప్రకటించారు. అలాగే ఒక రోజులో డిశ్చార్జీ అవుతారి వెల్లడించారు. దీంతో శుక్రవారం చక్కర్లు కొట్టిన వార్తలకు బ్రేక్ లు పడ్డాయి.

- Advertisement -

విక్రమ్ హీరోగా కోబ్రా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. “జులై 11న చెన్నైలోని ఫీనిక్స్ మార్కెట్ సిటీలో చియాన్ విక్రమ్ సమక్షంలో ‘కోబ్రా’ గ్రాండ్ ఆడియో లాంచ్. అక్కడ కలుద్దాం.” అంటూ ట్వీట్ చేశాడు.

అంటే, విక్రమ్ ఇప్పటికే కోలుకున్నాడని, అతి త్వరలోనే డిశ్చార్జీ అవుతాడని తెలుస్తుంది. అంతే కాకుండా, జులై 11న కోబ్రా మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ కు కూడా రాబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు