Telugu Songs: యూట్యూబ్లో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్స్ ఇవే..!

100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్స్..

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలలో పాటలు కూడా ప్రేక్షకులను మరింతగా అలరిస్తున్నాయి. ప్రత్యేకించి ఎంతలా అంటే యూట్యూబ్లో అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్స్ వ్యూస్ సాధించి ఆ పాటలు రికార్డు సృష్టిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే యూట్యూబ్లో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

ఛలో:
ప్రముఖ హీరో నాగశౌర్య , రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛలో.. ఇరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించిన ఈ సినిమా 2018 ఫిబ్రవరి 2 వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా ఇందులో “చూసి చూడంగానే నచ్చేసావే” పాట ఏకంగా 210 మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

- Advertisement -

జై లవకుశ:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుశ. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2017లో విడుదలైంది.. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ , ఎన్టీఆర్ మధ్య సాగే “నీ కళ్ళలోని కాటుక ఓ మెరుపుతీగ కాదా” అనే పాట ఏకంగా 190 మిలియన్స్ వ్యూస్ సాధించింది..

జాను:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం జాను..ఈ సినిమాలో శర్వానంద్ , సమంత తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలోని ” లైఫ్ ఆఫ్ రామ్” పాటకు ఏకంగా 196 మిలియన్స్ వ్యూస్ లభించాయి.

అల వైకుంఠపురములో:
గీత ఆర్ట్స్ మరియు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ , పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో.. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అన్ని పాటలు కూడా 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించాయి. ప్రత్యేకించి ఇందులో “బుట్ట బొమ్మ” పాట 40 రోజుల్లోనే 100 మిలియన్స్ న్యూస్ రాబట్టింది. ఇప్పటివరకు ఈ పాట ఏకంగా 867 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇక “రాములో రాముల” పాట ఏకంగా 646 మిలియన్ వ్యూస్ రాబట్టగా.. “సిత్తరాల సిరపడు” పాట 117 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది.

లవ్ స్టోరీ:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన చిత్రం లవ్ స్టోరీ .. 2021 లో విడుదలైన ఈ సినిమా అటు చైతూ ఇటు సాయి పల్లవి కెరియర్లో బెస్ట్ ఫిలిం గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని “సారంగదరియా “పాట ఏకంగా 160 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

పుష్ప:
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అయిన “ఉ అంటావా మావ “పాట ఏకంగా 404 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ పాట హిందీలో ఏకంగా 455 మిలియన్స్ వ్యూస్ రాబట్టడం విశేషం.

సర్కారు వారి పాట:
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట.. 2022 మే 12న విడుదలైన ఈ సినిమా పాటల విషయంలో కూడా సూపర్ హిట్గా దూసుకుపోయింది. ముఖ్యంగా ఇందులో “కళావతి” పాట ఏకంగా 245 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది.

గుంటూరు కారం:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాలోని “కుర్చీ మడతపెట్టి” సాంగ్ ఏ రేంజ్ లో పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఈ పాట పైన రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. ఈ పాట లిరికల్ సాంగే ఏకంగా 102 మిలియన్స్ వ్యూస్ సాధించింది.

వీటితోపాటు మరికొన్ని పాటలు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతూ మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్నాయి..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు