Teja : సినిమాని చంపేస్తుంది వాళ్లే !

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో కెమెరామెన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన తేజ. ఆ తరువాత హిందీ, తెలుగు భాషల్లో చాలా సినిమాలకి ఆయన కెమెరామెన్ గా పని చేసారు. 2000లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన చిత్రం సినిమాతో తేజ, డైరెక్టర్ గా పరిచయమయ్యారు. చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతో కెమెరామన్ వృత్తికి స్వస్తి చెప్పి దర్శకుడిగానే సినిమాలు చేస్తున్నారు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన జయం ,నిజం ,ఔనన్నా కాదన్నా సినిమాలు తేజకి దర్శకుడి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. అయితే ఎక్కువ మీడియాలో కనిపించడానికి ఇష్టపడని తేజ లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా వస్తున్న రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన గోపిచంద్ ని ఇంటర్వూ చేసారు. ఈ సందర్బంగా తేజ సినిమా థియేటర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

గోపిచంద్ తేజని ” కరోనా తరువాత సినిమా చూసే ప్రేక్షకులు మారారు ,ఓటిటి లోనే సినిమా ఎక్కువ చూస్తున్నారు అని అంటున్నారు ఒక ఫిలిం మేకర్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి ” అని అడిగిన ప్రశ్నకి తేజ సమాధానం చెప్తూ ” సినిమాని ఏది చంపలేదు కాకపోతే ఇప్పుడు సినిమాని జనాలు చాలా చోట్ల చూస్తున్నారు. యూట్యూబ్, టీవీ, థియేటర్ ఇలా అన్ని చోట్ల జనాలకి సినిమా ఇప్పుడు అందుబాటులో ఉంది. కానీ ఎక్కడ చుసిన కూడా థియేటర్ లో చూసిన ఫీల్ మనం టీవీ, మొబైల్స్ ఇవ్వలేము. అందుకే సినిమాని చంపడం ఎవరి వాళ్ళ కాదు కానీ.. మల్టీఫ్లెక్స్ థియేటర్ లో ఉండే పాప్ కార్న్ ధర సినిమాని చంపేయగలదు ఎందుకంటే సినిమా ఎంజాయ్ చేయాలంటే ఏదైనా తింటూ ,తాగుతూ చూడటం జనాలకి అలవాటు అయిపొయింది. కానీ దీన్ని వ్యాపారంగా చేస్తూ విపరీతమైన ధరలతో మల్టీఫ్లెక్స్ యాజమాన్యం వ్యవహరిస్తున్నారు. దీన్ని గనక మనం పట్టించుకోకపోతే సినిమాని జనాలు థియేటర్ కి రావడం మానేస్తారు. నా అభిప్రాయం ప్రకారం సినిమాని చంపే శక్తి పాప్ కార్న్ ఒక్కదానికే ఉంది ” అని అయన అన్నారు వాస్తవంగా కూడా ఇది అందరు ఎదుర్కుంటున్న సమస్య అవడంతో ఈ పాయింట్ ఇష్యూ చేస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనిపై గవర్నమెంట్ స్పందించాలని అందరు పోస్టులు చేస్తున్నారు

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు