Suriya : పాన్ ఇండియా మల్టీస్టారర్ రెడీ

మల్టీస్టారర్. ఇది తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ సేఫ్ గేమ్. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే, అభిమానులకు ఉండే థ్రిల్ వేరే లెవెల్ లో ఉంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగులో మల్టీ స్టారర్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు.

ఇదిలా ఉండగా, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. “ఆకాశం నీ హద్దురా” సినిమా దర్శకురాలు సుధ కొంగరతో సూర్య మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను హోంబాలే పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చే ఈ మూవీ మల్టీ స్టారర్ అని తెలుస్తుంది. సూర్య తో పాటు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని సమాచారం.

- Advertisement -

సూర్య కు కోలీవుడ్, తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీనికి తోడు ఇటీవల ఓటీటీలో వచ్చిన “ఆకాశం నీ హద్దురా” “జై భీమ్” సినిమాలు సూర్య క్రేజ్ ను మరింత పెంచాయి. అలాగే, ఈటి తెలుగులో నిరాశపర్చింది. కానీ, తమిళంలో మాత్రం కమర్షియల్ గా సేఫ్ అయింది.

అలాగే దుల్కర్ సల్మాన్ కు కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. టాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకోవడానికి “సీతా రామం” అనే సినిమాతో తొలిసారి రాబోతున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంటాడు.

ఈ ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ చేస్తే మంచి విజయం దక్కడం ఖాయమని చెప్పచ్చు. సుధా కొంగర టేకింగ్ కూడా ఈ సినిమాకు కలిసొస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు