Sukumar : సుకుమార్ కూతురి అద్భుతమైన టాలెంట్.. గమనించారా!

Sukumar : టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో మొదట రాజమౌళి పేరు వినిపిస్తే.. ఆ వెంటనే సుకుమార్ పేరు వినిపిస్తుంది. అంతలా సుకుమార్ పేరు మార్మోగిపోతోంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం “పుష్ప ది రూల్” కోసం దేశం మొత్తం ప్రేక్షకులు ఎంతలావెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప లాగే, ఈ మూవీని కూడా అదే లెవెల్ లో ఆవిష్కరించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాని చాలా ప్లానింగ్ తో లోకల్ ఫ్లేవర్ మిస్ కాకుండా యూనివర్సల్ అప్పీల్ తీసుకొచ్చి విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం సుకుమార్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీయస్ట్ దర్శకుడుగా సుకుమార్ (Sukumar) ఉన్నారు. పుష్ప ది రూల్ పూర్తి కాగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మళ్ళీ సినిమా చేయనున్నారు.

Sukumar's daughter Sukritveni impressed by singing a song

సుక్కూ కూతురు అద్భుతమైన టాలెంట్…

ఇక సుకుమార్ ఓవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా తన శిష్యులను దర్శకులుగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే సుకుమార్ కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇదిలా ఉండగా సుకుమార్ కూతురు తండ్రి బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తోంది. సుకుమార్ కూతురు “సుకృతవేణి” నటిగా అరంగేట్రం చేసి “గాంధీ తాత చెట్టు” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అయితే ఈ చిత్రానికి గాను 14వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా సుకృతివేణి అవార్డుని అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ రాక్ బ్యాండ్ లో సుకృత వేణి స్టేజ్ పైన ఇంగ్లీష్ సాంగ్ ఆలపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది.

- Advertisement -

పాటతో అలరించిన సుకుమార్ కూతురు..

తాజాగా సుకుమార్ కూతురు సుకృతవేణి ఓ స్టేజ్ ఇంగ్లిష్ సాంగ్ పాడి అలరించింది. ఈ వీడియో లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సుకుమార్ కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని టాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటున్నారు. కూతురు ఇలా తనకి ఇష్టమైన రంగంలో ప్రతిభ చూపిస్తే ఏ తండ్రి కైనా గర్వంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుకుమార్ (Sukumar) తన కూతురిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ సుకృతవేణి పాడిన సాంగ్ వీడియోని సుకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త ట్రెండ్ అవుతోంది. సుకుమార్ కూతురు సింగింగ్ టాలెంట్ చూసిన తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా టాలీవుడ్ లో మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటుందని సుక్కూ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ లో ఉండగా, ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ కాగానే రామ్ చరణ్ తో సినిమా మొదలుపెడతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు