Citadel: హాలీవుడ్ వేదికపై సమంత క్రేజ్ మాములుగా లేదు..!

రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ హాలీవుడ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవనున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సిరీస్ లో ప్రియాంక బెడ్ రూమ్ సీన్స్ లో చాలా బోల్డ్ గా నటించింది అంటూ టాక్ వస్తోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో. వివరాల్లోకి వెళితే సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటించనున్న సమంత కూడా ఈ ప్రీమియర్స్ కి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల శాకుంతలం లాంటి డిజాస్టర్ చవిచూసిన సమంత, దాని తాలూకు ప్రభావం ఏమి కనపడకుండా బ్లాక్ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందంతో సిటాడెల్ ప్రీమియర్ వేదికపై అందరిని ఆకర్షించింది. ఎంతలా అంటే ప్రియాంక చోప్రా కంటే కూడా సమంత మీదే ఫోకస్ వచ్చేంతలా సమంత అట్రాక్ట్ చేసింది. హాలీవుడ్ ఆడియెన్స్ కి సుపరిచితం అయిన ప్రియాంకను కాదని సమంత అటెన్షన్ అందుకుంది అంటే, ఫ్లాప్ తర్వాత కూడా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఏదేమైనా శాకుంతలం డిజాస్టర్ తో డీలా పడ్డ సమంత ఫ్యాన్స్ కి ఇది ఒకరకమైన బూస్టప్ అనే చెప్పాలి.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమంత ఫోటోలను చూస్తుంటే సిటాడెల్ లో హీరోయిన్ సమంత నా అన్న అనుమానం కలిగేలా ఉంది. అయితే ఈ సిరీస్ లో బోల్డ్ సీన్స్ ఉండటంపై కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, ఇంతకాలం బోల్డ్ సీన్స్ కి దూరంగా ఉన్న సమంత ఇప్పుడు ప్రియాంక రేంజ్ లో బోల్డ్ సీన్స్ లో నటిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు