Saitan: తెలుగులో హద్దులు దాటేస్తున్న అశ్లీలం !

రోజు రోజుకి తెలుగు సినిమాల్లో అశ్లీలత పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.భూతులు, సెక్స్ సీన్స్ లు ఈ మధ్య వచ్చే సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. వీటికి కళ్లెం వేయడానికి సెన్సార్ బోర్డు ఉన్నా కూడా అది నామమాత్రమే అయిపొయింది.

దానికి తోడు ఓటిటి ల పుణ్యమా అంటూ భూతులు, అశ్లిలత సినిమాల్లో ఉండటం అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, కాసేపటి క్రితం యూట్యూబ్ లో సైతాన్ అనే మూవీ ట్రైలర్ రిలీజయింది. ఈ ట్రైలర్ లో విపరీతమైన వైలెన్స్ తో పాటు విచ్చల విడిగా భూతులున్నాయి.

మరీ ఈ సినిమా తీసింది ఏ హాలీవుడ్ వాళ్ళో, బాలీవుడ్ సంస్థనో అయితే రోజు చూస్తుందే కదా అని ఒకింత సైలెంట్ గా ఉండే వాళ్లేమో కానీ ఇది తీసింది. టాలీవుడ్ మేకర్సే.

- Advertisement -

వై. యస్ రాజా శేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర సినిమాని తెరకెక్కించిన మహి వి రాఘవ్ ఈ సైతాన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలనే ఈయన సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ కి రైటర్ గా వర్క్ చేసారు. ప్రస్తుతం ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే మరి ఇలాంటి క్లాసీ సినిమాలు తీసే ఈ డైరెక్టర్ ఇంత భూతు పురాణంతో ఈ సైతాన్ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.

కంటెంట్ లో భూతులు అవసరం ఐతే వాటిని పెట్టారంటే, ఎవరు, ఎటువంటి అడ్డు చెప్పారు. ఇది కొన్ని సినిమాల విషయంలో ప్రూవ్ కూడా అయింది. కానీ సినిమా ఓటిటి వస్తుందని, జనాలు భూతులుంటే ఎక్కువగా చూస్తున్నారనే దైర్యం తో ఏమాత్రం విజ్ఞత లేకుండా ఇలాగా సినిమా తీయడం అనేది మంచి విధానం కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే విధంగా అడ్డు అదుపు లేకుండా సినిమాలుతీస్తే తొందర్లోనే ఓటిటిలకి కూడా సెన్సార్ రావడం తప్పదని అందరు అనుకుంటున్నారు. మరీ దీనిపై సైతాన్ మూవీ టీం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు