Custody : టబుతో నాగార్జున రిలేషన్షిప్ నిజమే – నాగచైతన్య

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎఫైర్ ఉందని ఎక్కువ కాలం గాసిప్ నడిచిన జంట టబు – నాగార్జున. ఈ ఇద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటించిన కారణంగా ఏదో సంబంధం ఉందని, అందుకే నాగార్జున ప్రతి సినిమాలోనూ టబూను తీసుకుంటున్నారని అప్పట్లో ఎన్నో పుకార్లు వచ్చాయి.

వీరిద్దరూ కలిసి 1995లో సిసింద్రీ, ఆ తరువాత నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలలో నటించారు. నాగార్జునతో ఎఫైర్ కారణంగానే టబు కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉందనే రూమర్ కూడా ఉంది. అంతేకాదు టబు హైదరాబాద్ కి వచ్చినప్పుడల్లా నాగార్జున ఫామ్ హౌస్ లోనే ఉంటుందని రూమర్ కూడా ఉంది. అయితే తాజాగా వీరి మధ్య ఎఫైర్ గురించి నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు ఈ ప్రశ్న ఎదురైంది.

అయితే దీనిపై పరోక్షంగా ఘాటుగా స్పందించాడు నాగచైతన్య. “టబూ గారితో మా ఫ్యామిలీకి మంచి రిలేషన్ షిప్ ఉంది. మా నాన్న, తమ్ముడు అందరికి ఆమెకి చాలా ఇష్టం. టబూ మా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్, పండగలకు హాజరవుతారు. అంతేకాకుండా హైదరాబాద్ కి వచ్చిన ప్రతిసారి మా నాన్నను, మమ్మల్ని కలుస్తుంది. మమ్మల్ని మీట్ అవ్వకుండా వెళ్ళనే వెళ్ళదు. ఏ పండగ ఉన్నా మాకు ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలుపుతుంది” అని చెప్పుకొచ్చారు నాగచైతన్య. దీంతో పరోక్షంగా నాగార్జునకి – టబుకి మధ్య ఉన్న రిలేషన్ ని కన్ఫర్మ్ చేశారు నాగచైతన్య.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు