Saalar: షూటింగ్ మళ్లీ స్టార్ట్ అపుడే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రాధేశ్యాం మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన డార్లింగ్, ఇప్పుడు చేతిలో అన్ని పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. మరోవైపు డార్లింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హీరో ప్రభాస్ ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణంరాజు మొన్న అనారోగ్యంతో మరణించారు. అయితే కృష్ణంరాజు మృతితో హీరో ప్రభాస్ చాలా కష్టసమయం ఎదుర్కొంటున్నాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో ప్రభాస్ ఇప్పుడు అప్పుడే సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ఈరోజు నుండి సలార్ షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ పరిస్థితిని చూసి సలార్ మేకర్స్ షూటింగ్ నీ అక్టోబర్ నెలకి వాయిదా వేసినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు