Eagle Movie First Review: ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ

Eagle First Review

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం “ఈగల్” ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీపైనే రవితేజ ఆశలన్నీ పెట్టుకున్నారు. “ఈగల్ “లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నవదీప్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ధమాకా తర్వాత రవితేజ ఈ బ్యానర్లో చేస్తున్న రెండవ మూవీ ఇది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అన్న టాక్ తాజాగా బయటకు వచ్చింది. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు స్పెషల్ షోలు వేయడంతో మరో మూడు రోజులు మిగిలి ఉండగానే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రవితేజ “ఈగల్” మూవీ ఫస్ట్ రివ్యూ టాక్ ఎలా ఉందన్న విషయంలోకి వెళ్తే…

ఇంతకీ ఈగల్ మూవీ ఎలా ఉందంటే… ఇది రవితేజ కెరీర్లో మరో ఖిలాడీ, రామారావు అవుతుందని టాక్ నడుస్తోంది. ఫస్టాఫ్ పర్లేదు అనిపించినా, సెకండ్ హాఫ్ బాగాలేదని అంటున్నారు. రేటింగ్ విషయానికి వస్తే 1.5 నుంచి 2 ఇవ్వొచ్చని చెబుతున్నారు. మొత్తానికి సినిమాపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో మళ్లీ పీపుల్ మీడియా వాళ్ళ డిజాస్టర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. రవితేజ గత ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో వరుస డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం నడుస్తున్న టాక్ చూస్తుంటే “ఈగల్”తో ఈ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. నిజానికి గతంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ఇప్పుడు ఈగల్ మూవీతో రవితేజతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస డిజాస్టర్లు అందుకుంటుంది. ధమాకా తర్వాత ఈ బ్యానర్ లో వచ్చిన ఏ మూవీ కూడా హిట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ బ్యానర్ పైనే ఉంది.

- Advertisement -

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది తాము నిర్మించిన 15 సినిమాలు విడుదల కాబోతున్నాయని, ఒకటి రెండు ఓటీటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. కనీసం నెలకు ఒక సినిమా నైనా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దాదాపు 40 సినిమాలు ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు విశ్వప్రసాద్. అయితే ఇప్పుడు ఈగల్ మూవీ విషయంలో వస్తున్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ దృష్ట్యా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై విమర్శలు మొదలయ్యాయి. పనికిరాని సినిమాలు 100 తీసినా ఉపయోగమేంటి? హిట్ కంటెంట్ ఉండే మంచి సినిమాలు సంవత్సరానికి నాలుగు చేసిన నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది అంటూ విశ్వ ప్రసాద్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న “ఈగల్” విషయంలో ప్రజలు ఎలాంటి తుది తీర్పునిస్తారో చూడాలి

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు