Family Star: అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే

Family Star

మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు విజయ్ దేవరకొండ. అయితే నాగ్ అశ్విన్ దర్శకుడుగా పరిచయమైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి క్యారెక్టర్ తో మంచి గుర్తింపును పొందాడు విజయ్. ఈ సినిమాలో నానితో పాటు నటించి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. విజయ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా విజయ్ కెరియర్ లో ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్
అలాంటిది.

చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన కెరీర్ ని కొనసాగించిన విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ అయ్యాడు. ఆ సినిమా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా చాలామంది యూత్ కి కూడా అద్భుతంగా కనెక్ట్ అయింది ఆ సినిమా. ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును పొందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతోనే తరుణ్ భాస్కర్ దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఆ సినిమా తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ ని మలుపు తిప్పింది. అప్పట్లో శివ సినిమా చేసిన సంచలనాన్ని తెలుగు సినిమా చరిత్రలో అర్జున్ రెడ్డి సినిమా మరోసారి చేసిందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డివంగా ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు.ఇదే సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కించి అక్కడ దాదాపుగా 200 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించాడు. అర్జున్ రెడ్డి సినిమా అనగానే ఒక బ్రాండ్ అనే ముద్ర పడిపోయింది. ఇకపోతే ఆ సినిమాతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

- Advertisement -

ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు భారీ స్థాయిలో ఆకట్టుకోకపోయినా, విజయ్ దేవరకొండ సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్స్ వస్తాయి. ఆ స్థాయి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంస్టాగ్రామ్ లో ఉన్నది విజయ్ కి మాత్రమే. ప్రస్తుతం విజయ ఫాలోవర్స్ సంఖ్య 21 మిలియన్స్ కు చేరుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్నాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు