Teja : రానా నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనే

విరాట పర్వం సినిమా తరువాత రానా ఏ సినిమా కమిట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో షూటింగ్ చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఇటీవలనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవడంతో, ఆ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. ఆ తరువాత రానా నాయుడు సీజన్2 చేయాల్సి ఉండింది. కానీ ఆ షోకి తెలుగులో చాలా వరకు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం సీజన్2కి కాస్తా సమయం పట్టేలా ఉంది.

ఇక వెబ్ సిరీస్ ల గురించి పక్కన పెడితే ప్రస్తుతం రానా చేతిలో సినిమాలేవీ లేవు, దాంతో రానా చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించటం మొదలు పెట్టాడు. మసూదా ఫేం తీరు వీర్ హీరోగా పరేషాన్ అనే సినిమా వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ సిద్దమవుతుంది. ఈ సినిమాకి రానా ప్రెసెంటేటర్ గా ఉండి, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తన తరువాతి సినిమా గురించిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అయితే ఆయనతో శేఖర్ కమ్ముల ప్రస్తుతం లీడర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని. ఇదివరకే తనని కలిసి కథ వినిపించాడని, ఫుల్ స్క్రిప్ట్ కంప్లిట్ అయ్యాక సినిమా సెట్ పైకి వెళ్తుందని, అలాగే డైరెక్టర్ తేజ కూడా ఆయనకి కథ చెప్పాడని, అహింస సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు