Animal: రాజమౌళి కి అవమానం..అడిగి మరీ అనిపించుకోవడం అంటే ఇదేనేమో..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సింహాద్రి సినిమాతో డైరెక్టర్గా మారిన ఈయన అక్కడి నుంచి తన కెరీర్ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు చేసింది కొన్ని సినిమాలే అయినా ఇప్పటివరకు ఫ్లాప్ చవిచూడని డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేశాము అంటే కచ్చితంగా వారి క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతుంది.

అనేంతగా ఆయన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల రాంచరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించగా.. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో అడ్వెంచర్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇదిలా ఉండగా ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళికి తాజాగా అవమానం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అర్జున్ రెడ్డి సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్ ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో జోరుగా కొనసాగిస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా నిన్న సాయంత్రం హైదరాబాదులో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

- Advertisement -

ఈ క్రమంలోనే రాజమౌళి మాట్లాడుతూ.. రణబీర్ కపూర్ ను ఈ విధంగా ప్రశ్నించారు.. రణబీర్ మీరు అటు నాతో అలాగే ఇటు సందీప్ రెడ్డి వంగతో ఒకే సమయంలో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికీ ఓకే చేస్తారు అని అడగగా.. దానికి రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. రెండు షిఫ్ట్ లు ఉంటాయి కదా సార్.. ఒక షిఫ్ట్ మీతో సినిమా చేస్తాను.. మరొక షిఫ్ట్ సందీప్ గారితో చేస్తాను అని సమాధానం ఇచ్చాడు.. అయితే దీనికి మళ్లీ రాజమౌళి మాట్లాడుతూ.. లేదు ఇద్దరిలో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఎవరిని ఎంచుకుంటారు..?

అని అడగగా.. దానికి రణబీర్ కపూర్ మొహమాటం లేకుండా ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే సందీప్ రెడ్డి వంగా అని పేరు చెప్పారు. ఇది రణబీర్ కపూర్ నిజాయితీకి అద్దం పట్టినా.. ఇది చూసిన చాలామంది గ్లోబల్ స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళిని రణబీర్ కపూర్ అవమానించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొంతమంది అడిగిమరీ అనిపించుకోవడం ఇదే అంటూ రాజమౌళి పై కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో యానిమల్ సినిమా చేసిన రణబీర్ కపూర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు