Anasuya: సరికొత్త లుక్ లో అనసూయ.. గ్లామర్ లవర్స్ కి నిరాశే..!

ప్రముఖ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. న్యూస్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇక అక్కడ నుంచి మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే గ్లామర్ బ్యూటీగా కూడా పేరు ఘడించింది. జబర్దస్త్ కార్యక్రమంలో తన అందచందాలతో , మాటలతో ఎంతోమంది యువతను ఆకట్టుకున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నెటిజన్ ల ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ట్రోల్స్ కి కూడా ఏమాత్రం భయపడకుండా తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక అలా ఒకవైపు బుల్లితెర షోలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు వెండితెరపై వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి పేరు దక్కించుకున్న అనసూయ సాధ్యమైనంత వరకు తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ మరింత బిజీగా మారింది.

ప్రస్తుతం పుష్ప సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ఈమె పుష్ప 2 సినిమాలో కూడా భాగమైంది . ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇదిలా ఉండగా నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అలాంటి లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది అనసూయ.

- Advertisement -

తాజాగా తన పూజ లుక్ షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ అడ్డనామాలతో శివ భక్తురాలిగా అవతారం ఎత్తింది. ఎప్పుడు తన గ్లామర్ తో హీట్ పుట్టించే అనసూయ.. తాజాగా ఈమె లోని ఈ కొత్త కోణం అందరినీ ఆకర్షించిందని చెప్పవచ్చు. ఇకపోతే పూజతో బాగా అలసిపోయాను.. కానీ సంతృప్తిగా ఉన్నాను.. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టింది. ఇక అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ క్షణాలలో వైరల్ అవ్వగా అభిమానులు తిరిగి ఆమెకు కార్తీక పౌర్ణమి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ షేర్ చేసిన ఈ లుక్ అందరినీ ఆశ్చర్యపరస్తోంది. ఇకపోతే గ్లామర్ లవర్స్ కి మాత్రం ఇది ఒకింత నిరాశ కలిగించిందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు