PV Sindhu : విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన సింధు… అతడి సినిమాలు నచ్చవట !!

PV Sindhu

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నప్పటికీ ఆయనకున్న ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు అంటేనే విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అనన్య పాండే, జాన్వి కపూర్ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతారు. ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ పై పివి సింధు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు దారి తీసాయి.

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఎన్నో అద్భుతమైన విజయాలతో భారత ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటింది. ఒలంపిక్స్ కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించి ఎంతోమంది భారతీయులకు స్పోర్ట్స్ పరంగా స్ఫూర్తిగా నిలిచింది. ఎప్పుడు స్పోర్ట్స్ లో బిజీ బిజీగా గడిపే ఈ స్టార్ ప్లేయర్ మొట్టమొదటిసారి సినిమాల గురించి ఓపెన్ గా మాట్లాడింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సింధు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ లో తన కెరీర్ ఎలా సాగింది, ఈ ఆట కోసం తాను ఎంత కష్టపడింది అనే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇదే క్రమంలో సినిమాల గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా తనకు క్రష్ లాంటివి ఏమీ లేవని, కానీ ప్రభాస్ అంటే మాత్రం చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే రామ్ చరణ్ సినిమాలు కూడా బాగా చూస్తానని, ఆయనంటే కూడా ఇష్టమని పేర్కొంది.

మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన తనను చాలా ఎంకరేజ్ చేశారని, సో స్వీట్ అంటూ మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపించింది. అదే సమయంలో తాను రామ్ చరణ్ ను కలిసినట్టు చెప్పుకొచ్చింది సింధు. ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగా చూస్తానని, ట్రిపుల్ ఆర్ మూవీని రీసెంట్ గా చూసానని వెల్లడించింది. అయితే ఆమె అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీకి ఇంకా చాలా మంది కొత్త వాళ్లు వస్తున్నారని, విజయ్ దేవరకొండ సినిమాలు అన్నీ చూడనని సింధు చేసిన కామెంట్స్ రౌడీ హీరో అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాయి.

- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమాల గురించి సింధు మాట్లాడుతూ… ఆయన సినిమాలు కొన్ని నచ్చాయి, కొన్ని మాత్రం నచ్చలేదని, అందుకే రౌడీ హీరో సినిమాలు అన్నీ చూడనని స్పష్టం చేసింది. అయితే ఎవరిష్టం వాళ్లదని, వాళ్లకి కూడా ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి ఎవరినీ విమర్శించను అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది సింధు. అయితే ఫేవరెట్ హీరో అంటూ ఎవ్వరూ లేరని అంటూనే దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయద్దు అంటూ నవ్వేసింది సింధు. అయితే అంతా బాగానే ఉంది గానీ ఆమె విజయ్ దేవరకొండ సినిమాలపై చేసిన కామెంట్స్ మాత్రం హాట్ హాట్ డిస్కషన్ కు దారి తీసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్షన్ తో ఇది వివాదంగా మారకుండా ఉంటే చాలు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు