Balakrishna: మోక్షజ్ఞ విషయంలో బాలయ్య సైలెన్స్.. జాతకాలే కారణం..?

Balakrishna

తరాలు మారుతున్నా… టెక్నాలజీ పెరిగిపోతున్నప్పటికీ కూడా చాలామంది జాతకాలను ఎక్కువగా నమ్ముతారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా, ప్రముఖ రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా జాతకాలను అలాగే ముహూర్తాలను ఎక్కువగా నమ్ముతారు. వీటికి ఆయన ప్రథమ ప్రాముఖ్యత ఇస్తారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన చేసే సినిమా ఈవెంట్ ల డేట్ల విషయంలో అలాగే రిలీజ్ డేట్ల విషయంలో కూడా ముహూర్తాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే బాలయ్య స్వయానా తన రక్తం పంచుకు పుట్టిన కొడుకు కెరియర్ విషయంలో ముహూర్తాలు, జాతకాలు పట్టించుకోకుండా ఉంటారా..? అందుకే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో కూడా ఆయన జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఆలస్యం అవ్వడానికి కూడా బాలయ్య కారణం అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఎప్పుడైతే సినిమాల్లోకి వస్తే అనుకూలంగా ఉంటుందో అప్పుడే మోక్షజ్ఞను బాలయ్య సినిమాలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఎంతమంది చెబుతున్నా మోక్షజ్ఞ విషయంలో మాత్రం బాలయ్య సైలెన్స్ వహించడానికి కారణం జాతకాలే అని తెలుస్తోంది. ఇక జాతకాల ప్రకారం అనుకూలంగా ఉన్న సమయంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తే సులభంగా స్టార్ స్టేటస్ దక్కి మోక్షజ్ఞ పాన్ ఇండియా హీరో అవుతారని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం..

ఇకపోతే ఇప్పటికే బాలయ్య ఎంతోమంది స్టార్ దర్శకులను సంప్రదించినట్లు, వారిచేత అద్భుతమైన కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞ ను లాంచ్ చేయడానికి అటు నిర్మాతలు ఇటు దర్శకులు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ కూడా లుక్స్ విషయంలో భారీగా మారిపోయారు ఒకప్పటి మోక్షజ్ఞకు ఇప్పటి మోక్షజ్ఞకు చాలా తేడా ఉంది. ఇకపోతే ఈ ఏడాది మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా.. ఈయన కెరియర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల చివరినాటికి ఏపీలో ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే బాలయ్య మోక్షజ్ఞ కెరియర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం నందమూరి అభిమానులకు భారీ అభిమానులు ఉన్న నేపథ్యంలో మోక్షజ్ఞకు సంబంధించిన ఏ క్రేజీ అప్డేట్ అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకొని మోక్షజ్ఞ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మరోవైపు మోక్షజ్ఞ కూడా డైలాగ్స్ అద్భుతంగా చెబుతాడని డాన్స్ ఇరగదీస్తాడనే టాక్ కూడా ఉంది. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది.. ఒకవేళ వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు