Poonam Kaur: గురూజీని మళ్ళీ కెలికిన పూనమ్.. దాసరిని లాగుతూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్ ఈ మధ్య సినిమాలలో నటించలేదని చెప్పాలి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈమె ఇప్పుడు మళ్లీ అగ్ర దర్శకుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నిప్పులు చెరగడం హాట్ టాపిక్ గా మారింది.. స్వర్గీయ దాసరి నారాయణరావు పాదాల వద్ద ఈమె కూ వున్న ఫోటో ను షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. దీంతో ట్విట్టర్లో ఈమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.. మరి ఆ పోస్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం..

మళ్లీ ట్విట్టర్లో కెలికిన పూనమ్ కౌర్.
తాజాగా గురూజీ పై మరొకసారి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. “నేను గతంలో చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను.. గురు అనే పదానికి ఒక్కరంటే ఒక్కరే ఈ సినిమా ఇండస్ట్రీలో సరితూగుతారు.. సినిమా పరిశ్రమలో అత్యధిక మంది గౌరవించేది కేవలం దాసరి నారాయణరావుని మాత్రమే.. ఆయనకు టాలెంట్ ను గుర్తించే వ్యక్తిగా పేరు ఉంది.. అయితే ఆయనకు భిన్నంగా ఒక వ్యక్తి స్క్రిప్టులను హైజాక్ చేస్తారు.. స్క్రిప్టును హైజాక్ చేసినంత సులభంగా దాసరికి ఉన్న గురూజీ అనే బిరుదుని కూడా హైజాక్ చేశారు” అంటూ సెటైర్లు వేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

పూనమ్ ట్వీట్ పై నెటిజన్ స్పందన..
తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవును గౌరవనీయులైన వ్యక్తి అంటూ కొంతమంది కామెంట్ చేశారు.. మరికొంతమంది మాత్రం ఎన్నికల సమయాన్ని చూసుకొని కరెక్ట్ టైం లో ఎంట్రీ ఇచ్చావు.. సింపతీ సంపాదించుకోవడానికి మీ ప్లాన్ భలే ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు నువ్వు వేసే సెటైర్లు అందరికీ అర్థమయ్యేలా ఉంటే బాగుండు అంటూ కూడా ఈమెని విమర్శిస్తున్నారు..

- Advertisement -

త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్..
గత కొంతకాలంగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసుని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.. సోషల్ మీడియాలోనూ మీడియా ప్రెస్ మీట్స్ లో కూడా సంచలన ఆరోపణలు చేస్తోంది. అయితే పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఈ వివాదం పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది.. అయితే తన పంతాలో తాను విమర్శలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈమె నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని మెన్షన్ చేస్తూ డైరెక్ట్ గా కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ఈమె చేసిన కామెంట్లు సర్వత్ర వైరల్ గా మారుతున్నాయి..

పూనమ్ కౌర్..
పూనంకౌర్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. అప్పట్లో తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈమె మళ్లీ తెలుగు సినిమాలలో కనిపించలేదు.. అయితే పవన్ కళ్యాణ్ తో ఎఫైర్ ఉంది అనే వార్తల్లో నిలిచింది. అంతేకాదు రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే సోషల్ మీడియా ద్వారా అంతే దీటుగా సమాధానం ఇచ్చేది.. దీంతో ఎఫైర్ వార్తలకు మరింత జోరు అందుకుంది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ పై ఇలాంటి కామెంట్లు చేయడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు