Meena : సీనియర్ హీరోయిన్ భర్త మృతి

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు మీనా. టాలీవుడ్ లో వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడారు. మీనా నటిస్తే సినిమా హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో ఉండేదట. అయితే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో అవకాశాలు క్రమంగా తగ్గాయి. దీంతో మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే అమ్మాయి కూడా ఉంది. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తున్న మీనా కి మంగళవారం పెద్ద షాక్ తగిలింది.

ఈ సీనియర్ హీరోయిన్ భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొన్ని నెలలుగా లంగ్ డిసీజ్ తో బాధపడుతూ వస్తున్నారట. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారట. కానీ ఫలితం లేకపోయింది. వైద్యులు ప్రయత్నించినప్పటికీ విద్యాసాగర్ కన్నుమూశారు.

కాగా, విద్యాసాగర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దాని తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, వీరి ఇంటి వద్ద పావురాలు ఎక్కువగా ఉంటాయట. పావురాల వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటం వల్ల ఊపిరితిత్తులుకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిందని తెలుస్తుంది. దీంతో విద్యాసాగర్ కు ఊపిరితిత్తులను మార్చాలని డాక్టర్స్ ప్రయత్నించారని సమాచారం. అయితే, సరైన సమయంలో డోనర్ లేకపోవడంతో విద్యాసాగర్ మృతి చెందాడని వినిపిస్తోంది.

- Advertisement -

విద్యాసాగర్ మృతితో సినీ ప్రముఖులు మీనాకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు మీనాను పరామర్శించడానికి వెళ్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు