Vikram: విక్రమ్ ఓటిటి కి సిద్ధం

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ అయిన విషయం విదితమే.
విశ్వరూపం తరవాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు నాయగన్.
చాలా ఏళ్ళ తరవాత ఎంట్రీ ఇచ్చిన నాయగన్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. విక్రమ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లాంటి నటులు కీలక పాత్రలను పోషించారు.

సినిమా అంతా అయిపోతుంది అనుకున్న తరుణంలో సూర్య రోలెక్స్ రోల్ సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. విక్రమ్ సీక్వెల్ కూడా ఉండబోతుంది అని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అంచనాలకు మించి సెన్సేషనల్ హిట్ అయి తమిళ నాట ఇప్పటికి సాలిడ్ థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది. ఇప్పుడు విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధమవుతుంది.

ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమా జూలై 8 న డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు