Mahesh Babu: ఈ హీరో ఫంక్షన్లకి ఎక్కువగా ఎందుకు వెళ్ళరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. అయితే మొదటి సినిమా అంతగా పేరు తెచ్చి పెట్టకపోయినప్పటికీ ఆ తరువాత మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు వంటి సినిమాలు చేసి అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరిలో కూడా చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు కి కాస్త మొహమాటం ఎక్కువ అన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఆయన సినిమా ఫంక్షన్స్ కి తప్ప బయట ఎక్కడా కూడా పెద్దగా కనిపించరు. ఇప్పుడిప్పుడు వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు సినిమా ఫంక్షన్స్ కి వస్తున్నారు కానీ.. ఒకప్పుడు అయితే అసలు సినిమాల్లో తప్ప మహేష్ బాబు బయట ఎక్కడా కనిపించేవాడు కాదు.

ఇలా మహేష్ బాబు ఫంక్షన్లకు ఎక్కువగా రాకపోవడానికి ఒకే ఒక కారణమట. ఆయనకి మొహమాటం ఎక్కువ. మహేష్ బాబు ఎక్కువ కూల్ గా, క్లాసిక్ గా, ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారట. ఈ కారణంగానే ఆయన ఎక్కువగా ఏ ఫంక్షన్స్ కి హాజరుకారు. ఇక ఆయనకు ఖాళీ సమయం దొరికిందంటే భార్యా పిల్లలతోనే గడుపుతూ ఉంటారు. సమయం దొరికిందంటే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్, టూర్లు అంటూ ఎంజాయ్ చేస్తారంట. కానీ మిగతా ఫంక్షన్లలో పాల్గొనాలంటే మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటారట. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో (ఎస్ఎస్ఎంబి 28) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు