Vishwambhara: ‘విశ్వంభర’కి వింత సమస్య.. తీరేనా..?

ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోల సినిమాలకు స్టార్ కాస్ట్ ఎంపిక అనేది చాలా సమస్యగా మారుతోంది.. ముఖ్యంగా హీరోలకు జోడీ గా హీరోయిన్ కోసం చాలామందిని వెతకాల్సి వస్తోంది..కొత్తవారిని తీసుకుంటే..వయసు తేడా కొడుతోందని అభిమానులు సైతం వాపోతున్నారు.. మరోవైపు సీనియర్ హీరోయిన్స్ ను తీసుకోలేని పరిస్థితి ఏర్పడడంతో.. హీరోయిన్ విషయంలో ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాకు కూడా ఒక వింతైన సమస్య ఏర్పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

విశ్వంభర కి స్టార్ కాస్ట్ కొరత..
ఈ సినిమాలో చిరంజీవి గతంలో నటించిన హిట్లర్ సినిమాలో లాగా ఐదుగురు చెల్లెల్లు ఉంటారట. అయితే ఈ ఐదు మంది చెల్లెళ్లను విశ్వంభర సినిమాకి ఎంపిక చేయాల్సి ఉన్నది.. కథ పరంగా వారికి చాలా ప్రాధాన్యత ఉన్నదట.. కనుక కాస్త ఫేమస్ అయిన వారిని ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.. ముఖ్యంగా చిరంజీవి సినిమా కనుక ఎవరిని పడితే వారిని తీసుకోవడం కుదరదు.. అలాగని స్టార్స్ ని సంప్రదిస్తే బడ్జెట్ భారీగానే పెరిగిపోతుంది.. దీంతో డైరెక్టర్ వశిష్ట అండ్ టీం ఈ ఐదు మంది భామల కోసం తెగ అన్వేషిస్తున్నట్లు సమాచారం.

ఐదుగురు వీరే..
త్వరలోనే తెలుగు సినిమా వారు లేదా తెలుగు బుల్లితెర వారిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇదిలా ఉండగా మరోవైపు ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెళ్ల పాత్రలో ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్, సురభి, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ వంటి వారి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు చిరంజీవికి జోడిగా హీరోయిన్ త్రిష నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలా భారీ కాస్ట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని.. భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్ వారు తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

బడ్జెట్ మరియు విడుదల తేదీ..
వచ్చే ఏడాది సంక్రాంతికి అనగా జనవరి 10 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ సైతం ఇప్పటికే ప్రారంభించగా.. రెండు షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నదట..ఇక చిరంజీవి చాలా కాలం తర్వాత సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి రెమ్యునరేషన్..
గతేడాది వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ క్రేజ్ అందుకున్న చిరంజీవి ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమా తర్వాత భోళాశంకర్ సినిమా తెరకెక్కించారు.. కానీ ఇది డిజాస్టర్ గా నిలిచింది.. అయితే ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవికి వరించడం తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఇప్పుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విశ్వంభర సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.. ఇక చిరంజీవి క్రేజ్ ను బట్టి నిర్మాతలు కూడా అంత పారితోషకం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు