Hardhik-Natasha : అన్ని పుకార్లకు చెక్ పెట్టిన హార్దిక్ తమ్ముడు..!

Hardhik-Natasha : బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా – నాటాషా స్టాంకోవిక్ జంట విడాకుల గురించి రోజుకో క‌థ‌నం వెలువ‌డుతోంది. ఇంత‌కుముందు న‌టాషా స్టాంకోవిక్ కి హార్థిక్ ఆస్తుల్లో 70 శాతం చెల్లించుకోవాలంటూ ఒక వార్త తెగ వైరల్ అయింది. ఇంత‌లోనే త‌న ఆస్తుల్లో 50శాతం త‌ల్లి పేరు మీద‌నే ఉన్నాయ‌ని హార్థిక్ వివ‌రిస్తున్న ఓ త్రో బ్యాక్ వీడియో వైర‌ల్ అయింది. అలాగే వీరిద్దరూ విడిపోతున్నార‌న్న పుకార్ల న‌డుమ నటాషా స్టాంకోవిక్ ప్రేమ గురించి సోష‌ల్ మీడియాలో రోజుకోవార్త పుట్టుకొస్తుంది. ఇక తాజాగా రెండు రోజుల కింద నటాషా స్టాంకోవిక్ – హర్హిక్ పాండ్యా యొక్క తన ఇంటిపేరును తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించ‌డంతోనే ఈ రూమర్లు మరింతగా పుట్టుకొచ్చాయి. స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లలో హార్జిక్‌కు మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ వచ్చే నటాషా ఈసారి టోర్నీ ఆద్యంతం మ్యాచ్‌లలో అస్స‌లు కనిపించలేదు. నటాషా- హార్దిక్ (Hardhik-Natasha) బ్రేక‌ప్ పై ఇన్ని వార్త‌లు వ‌స్తున్నా కానీ దానికి ఈ జంట స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటో అర్థం కాలేదు. అయితే దీనికి కారణం త‌న భ‌ర్త‌పై జ‌రుగుతున్న ట్రోలింగుకి న‌టాషా స్పందించ‌కూడ‌ద‌ని భావించార‌ట‌. అందువల్ల కొంతకాలం పాటు వారు ఏ ఫోటోలు లేదా వీడియోల‌ను పోస్ట్ చేయవ‌ద్ద‌ని ఈ జంట నిర్ణయించుకున్నారని తెలిసింది.

Krunal Pandya gives clarity to Hardhik-Natasha divorce rumours

రూమర్లకు చెక్ పెట్టిన హార్దిక్ తమ్ముడు…

అయితే హార్థిక్ పై వస్తున్న ట్రోల్స్ ని దూరం పెట్టడం కోసం, వీళ్ళు సోషల్ మీడియా లో సైలెంట్ గా ఉన్నారు.తద్వారా నటాషా అన్ని సోషల్ మీడియా ట్రోల్‌ల నుండి తప్పించుకోవచ్చు. అయితే వీళ్ళు విడిపోతున్నారు అన్న పుకార్ల న‌డుమ, ఇప్పుడు ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాడు హార్థిక్ సోద‌రుడు క్రునాల్ పాండ్య‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. అన్నా వ‌దిన‌ల‌పై పుకార్ల న‌డుమ హార్థిక్ బ్రదర్ క్రునాల్ పాండ్యా త‌న అన్నా వ‌దిన‌ల కుమారుడు అగస్త్య పాండ్యా.. అత‌డి వ‌య‌సున్న మ‌రో చిన్నారితో కలిసి ఆనందంగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసారు. క్రునాల్ ఈ పోస్ట్ కు `హ్యాపీ ప్లేస్` అని ఈమోజిలను కూడా షేర్ చేసాడు. క్రునాల్ తన అన్న కుమారుడు అగస్త్య స‌ర‌దాగా టైమ్ పాస్ చేస్తుండ‌డం క‌నిపించింది. ఈ విలువైన క్షణాలు హార్థిక్ అభిమానుల ముఖాలపై చిరునవ్వు తెచ్చాయి. నటాషా ఈ పోస్ట్‌పై హార్ట్ అండ్ ఐ ఎమోజీల‌తో వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి హార్దిక్ ఫ్యామిలీ లో అంతా సజావుగానే ఉందని తేలిపోయింది.

- Advertisement -

నటాషా సెల్ఫీ..

ఇక ఇలాంటి వార్తల న‌డుమ‌ నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో తన వ్యాయామ సెషన్ నుండి ఒక వీడియోను పంచుకుంది. శుక్రవారం నాడు హైడ్రేటింగ్ ఐ- పాచెస్ ధరించి ఆ ఫోటోని షేర్ చేసింది. మరొక స్నాప్‌లో నటాషా తన లుక్ కి సంబంధించిన సెల్ఫీని షేర్ చేసింది. దీన‌ర్థం సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అని నెటిజ‌న్లు భావించారు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా – నటాసా స్టాంకోవిక్ 31మే 2020 న వివాహం చేసుకోగా, వారి వ్యక్తిగత జీవితంలో క‌ల‌త‌ల కారణంగా ఇద్దరూ వార్తల్లో ఉన్నారని, నెటిజన్లు నటాషా సోషల్ మీడియా కార్యకలాపాలను గమనించి వారి మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని, విడాకుల పుకార్లు వైర‌ల్ చేసారు. ఇదంతా ఫేక్ అని తేలిపొయింది. ఇక వచ్చే ఏడాది హార్దిక్ పాండ్యా కం బ్యాక్ ఇచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు