Love me : డివైడ్ టాక్ తో కుమ్మేసిన లవ్ మీ డే1.. కానీ ముందుంది అసలు లెక్క…

Love me : టాలీవుడ్ లో గత రెండు నెలలుగా సరైన సినిమా లేక బాక్స్ ఆఫీస్ వెలవెల బోయింది. అప్పుడెప్పుడో వచ్చిన టిల్లు స్క్వేర్ తర్వాత మళ్ళి హిట్ మొహం చూడలేకపోయింది టాలీవుడ్. ఇదే సమయంలో పక్క ఇండస్ట్రీలలో వందల కోట్ల వసూళ్ల సినిమాలు వస్తున్నాయి. కానీ టాలీవుడ్ లో వసూళ్ల మాట అటుంచి ఒక డీసెంట్ హిట్ సినిమా కూడా రాలేదు. ఇక షూటింగ్ డిలే ల వల్ల పెద్ద సినిమాలీ వాయిదా పడగా, ఎన్నికల హడావిడి, ఐపీఎల్ సీజన్ ఎఫెక్ట్, ఎండల వల్ల మీడియం రేంజ్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. దీని వల్ల తెలంగాణ లో పది రోజులు సినిమా థియేటర్లు కూడా మూత బడ్డాయి. అయితే ఎట్టకేలకు సమ్మర్ ఎండింగ్ లో ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఇక నిన్న రాజు యాదవ్, అలాగే లవ్ మీ అనే చిన్న సినిమాలు రిలీజ్ కావడం జరిగాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా నటించిన రెండో సినిమా లవ్ మీ (Love me) మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

Love me movie first day collections

డివైడ్ టాక్ తోనూ డీసెంట్ ఓపెనింగ్స్..

ఇక లవ్ మీ సినిమా ట్రైలర్ లో కాన్సెప్ట్ యూనిక్ గా అనిపించడంతో ఆడియన్స్ లో బజ్ అయితే పెరిగిపోయింది. కానీ తీరా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే నెగిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కొన్ని సాంగ్స్, కొన్ని హారర్ సీన్స్ మినహా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదని జనాలు అంటున్నారు. అయితే సినిమా కలెక్షన్లు అంతగా ఉండవని అనుకున్నారు నెటిజన్లు. కానీ లవ్ మీ సినిమాకు ఇక కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకున్నా కూడా బుక్ మై షోలో మొదటి రోజున ఆల్ మోస్ట్ 25 వేలకు పైగా టికెట్ సేల్స్ జరగగా, డీసెంట్ షేర్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 85 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకుందని అంచనా. వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకుందని అంచనా. వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 2.20 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

జోరు చూపించాలి..

అయితే ఓవరాల్ గా సినిమాకి మొదటి ఆటకి వచ్చిన టాక్ కి ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న పరిస్థితికి ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక సినిమా వాల్యూ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 6 కోట్ల దాకా ఉంటుదని అంచనా. చాలా చోట్ల ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేయడం జరిగింది. సినిమా వీకెండ్ లో ఇలానే జోరుని చూపించి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తే వాల్యూ బిజినెస్ ను అందుకోవచ్చు, కానీ దానికి సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ (Love me) సినిమాలో ఆశిష్ రెడ్డి హీరోగా నటించగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు