Hardhik Pandya : హార్దిక్ – నటాష జంట విడిపోనుందా? ఇంస్టాగ్రామ్ సంకేతాలు?

Hardhik Pandya : టాలీవుడ్ స్టార్ క్రికెట్ ప్లేయర్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి అల్ రౌండర్ అనిపించుకున్న ఈ ప్లేయర్ మే 31, 2020న నటాష స్టాంకోవిచ్ అనే మోడల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్య నటాషా జోడి కూడా సోషల్ మీడియా లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక అదే సంవత్సరం జూలై 30న వారి సంతోషాలని రెట్టింపు చేస్తూ కొడుకు అగస్త్యకు స్వాగతం పలికింది ఈ జంట. ఇదిలా ఉండగా, రీసెంట్ గా కొన్ని సంఘటనలు ఈ సెలబ్రిటీ జంటను అల్లకల్లోలంగా ఎదుర్కొన్నాయని సూచిస్తున్నాయి. IPLలో హార్దిక్ పాండ్యా తన పేలవమైన ప్రదర్శనతో ఆన్‌లైన్‌లో ఎదురుదెబ్బలు తిన్నప్పుడు, ట్రోలింగ్ అవుతున్నపుడు పలు రకాల వార్తలు గురించి గుసగుసలు వినిపించాయి. ‘నటాషా మరియు హార్దిక్ విడిపోయారా? అనే సూచనతో రెడ్డిట్ పోస్ట్ రూమర్లను రేకెత్తించింది. నటాషా యొక్క సోషల్ మీడియా ఖాతాలో పలు మార్పులు ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.

Will Hardhik Pandya - Natasha Stankovic couple break up?

పేరు మార్చుకుంది..

ఇక తాజాగా నటాషా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ముఖ్యంగా తన ఇంటిపేరును మార్చుకుంది. మరియు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి హార్దిక్ యొక్క అన్ని ఫొటోస్ ని తొలగించింది. ముఖ్యంగా హార్దిక్ పుట్టినరోజు లాంటి ముఖ్యమైన సందర్భాలలో జంట మధ్య పరస్పర పోస్ట్‌లు మరియు పరస్పర చర్యలు లేకపోవడాన్ని గమనించిన ఫ్యాన్స్ ఆ విషయాన్నీ గుర్తించారు. వారు కొన్ని ఫ్యామిలీ చిత్రాలను నిలుపుకున్నప్పటికీ, ఇటీవల షేర్ చేసిన క్షణాలు, స్పెషల్ మూమెంట్స్ స్పష్టంగా లేకపోవడం తెలుస్తుంది. ముఖ్యంగా IPL 2024 యొక్క తీవ్రమైన పరిశీలనల మధ్య హార్దిక్ పాండ్య ట్రోలింగ్ అయ్యాడు… అవుతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోలింగ్ నుండి కాస్త తప్పించుకోడడానికే ఈ జంట ఇలా చేసిందని కొందరు ఫాలోవర్లు అంటున్నారు. ట్రోలింగ్‌ల మధ్య జనాల దృష్టికి దూరంగా ఉండమని నటాషాను హార్దిక్ తనకి చెప్పాడని హార్దిక్ ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

సమయమే చెప్తుంది?

ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా లో వీరి లెక్కలు చూస్తుంటే విడిపోయే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇటు సోషల్ మీడియా లో కూడా వీళ్ళు విడిపోతారని, కొందరు అదంతా రూమర్స్ అని రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ విషయంపై కొందరు అవగాహన మరియు సానుభూతిని వ్యక్తం చేస్తే, మరికొందరు నటాషా చర్యలలో వీళ్ళ రిలేషన్షిప్ యొక్క స్వభావంపై ఊహించారు. ఇక సోషల్ లో వీళ్ళ చర్య కి, వీళ్ళ ప్రేమకథకు ముగింపుని సూచిస్తుందా లేదా ప్రతికూల పరిస్థితుల మధ్య తిరిగి ఒకటవుతారా! నటాషా స్టాంకోవిచ్ మరియు హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) చుట్టూ ఉన్న పుకార్ల వెనుక ఉన్న వాస్తవాన్ని కాలం మాత్రమే వెల్లడిస్తుంది. ఇక హార్దిక్ పాండ్య ఈ ఏడాది ఐపీఎల్ లో తన పేలవ ప్రదర్శన కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రానున్న T20 వరల్డ్ కప్ లో కం బ్యాక్ ఇస్తాడని హార్దిక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు