Honey Rose : గెలిస్తే బికినీలో కనిపిస్తా! అన్ని తెలిసే తెగించిందిగా?

హనీ రోజ్ : గత కొంత కాలంగా ఐపీఎల్ సీజన్ ఉత్కంఠగా నడుస్తోందన్న విషయం తెలిసిందే. ఈ ఇయర్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు అయిపోగా, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు మిగిలాయి. ఇదిలా ఉండగా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ ఐపీఎల్ ని ఏదో ఇండియా మ్యాచ్ లాగా ప్రెస్టీజియస్ గానూ తీసుకున్నారు. కొంత మంది ఫెవరేట్ క్రికెటర్ల ఫ్యాన్స్ అయితే, మరి కొందరు హోమ్ గ్రౌండ్ ఫ్యాన్స్. అయితే ఈ మ్యాచుల్లో గెలుపోటములను ఆనందించాలి. ఓడిపోతే ఫీల్ అయి లైట్ తీసుకొవాలి గాని, ఈ మధ్య కొందరు మరీ మితిమీరి పోతున్నారు. ఆ మధ్య హీరోయిన్ వర్ష బొల్లమ తన కిష్టమైన టీమ్ ఓడిపోతే ఏదో కోల్పోయినట్టుగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టింది. ఇప్పుడు మరో హీరోయిన్ ఏకంగా ఆ టీం గెలిస్తే అర్ధనగ్న పోటోలను పెడతానని కామెంట్స్ చేసి వైరల్ అయింది. ఆ భామ ఎవరో కాదు తెలుగులో వీర సింహారెడ్డి తో ఒక్కసారిగా పాపులర్ అయిన హానీ రోజు.

గెలిస్తే బికినీ లో ఫొటోలు పెడుతా – హనీ రోస్

ఇక నిన్న రాత్రి (మే 22) న ఐపీఎల్ 2024లో బెంగుళూరు VS రాజస్థాన్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో RCB బెంగుళూరు గెలిస్తే తన బికినీలో షేర్ చేస్తానని హనీ రోజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఆ వార్తలు రాత్రి వైరల్ అయ్యాయి. అయితే నైట్ మ్యాచ్ లో బెంగుళూరు ఊడిపోయింది. దీంతో అమ్మడు పిక్స్ పెట్టలేదు. అయితే బెంగుళూరు దాదాపుగా మ్యాచ్ చేజార్చుకునే పరిస్థితుల్లో ఉన్నాకే ఈ ట్వీట్ హనీ రోజు వేసిందని, గెలుస్తుందని తెలిస్తే ట్వీట్ వేసేది కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా అన్నీ తెలిస్తే తెగించి ట్వీట్ చేసింది అని అంటున్నారు నెటిజన్లు. ఇక బెంగుళూరుఎం మ్యాచ్ ఓడిపోవడంతో పాటు మూవీ సెలెబ్రిటీస్ కూడా ఫీల్ అవుతున్నాయి. ఇక తదుపరి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రాజస్థాన్ తో సెమీ ఫైనల్ లో తలపడనుంది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి గెలిస్తే బికినీ పిక్స్ షేర్ చేస్తానని హనీ రోజ్ ట్వీట్ చేసింది

ఇక హానీ రోజు విషయానికి వస్తే..

టాలీవుడ్ లో ఎప్పుడో పదిహేనేళ్ల కిందే ఆలయం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ ఛాన్సులు రాకపోయేసరికి మలయాళం ఇండస్ట్రీ కి చెక్కేసింది. అక్కడ పలు సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించింది. ఇక ఈ మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ (హనీ రోజ్) లాస్ట్ ఇయర్ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తిరిగి తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వగా ఒక్కసారిగా వైరల్ అయింది. ఇక అప్పటినుంచి కుర్రకారు ఈమె అంటే పడి చస్తున్నారు.. అయితే సినిమాలలో షాపింగ్ మాల్స్ తోనే గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే వీరసింహారెడ్డి సినిమా విడుదల అయ్యి ఇప్పటికి ఏడాది పైనే కావస్తున్నా ఇప్పటి వరకు తన తదుపరి మాత్రం ఇంకా తెలుగులో ప్రకటించలేదు. కానీ అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో సందడి చేస్తూ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు