Kushitha Kallapu : అందాల ప్రదర్శనలో నేనేం తక్కువ కాదంటున్న తెలుగమ్మాయి..

Kushitha Kallapu : టాలీవుడ్ లో ఈ మధ్య తెలుగమ్మాయిలు బాగానే క్లిక్ అవుతున్నారు. మొన్న అంజలి దగ్గరి నుండి మొదలుపెడితే, ఇషా రెబ్బ, చాందిని చౌదరి, ప్రియాంక జవాల్కర్, అనన్య నాగళ్ళ, శోభిత ధూళిపాళ ఇలా చాలా మంది హీరోయిన్లు పాపులర్ అవుతున్నారు. ఇంకా కొంతమంది హీరోయిన్లు బుల్లితెరపై, అలాగే యూట్యూబ్ లో ఫేమస్ అయి హీరోయిన్లు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు చిత్ర పరిశ్రమలో లేటెస్ట్ గా వస్తున్న అమ్మాయిలు, ఇప్పుడు సినిమాల కంటే ముందే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ పెంచుకుంటూ, గ్లామర్ షో ద్వారా అవకాశాలను అందుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మరో క్యూట్ పాప “కుషిత కల్లపు” కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తన అందం, టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తెలుగమ్మాయి కుషిత తన కెరీర్ ను యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో ప్రారంభించి, ఈ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే వెస్ట్రన్ అవుట్ఫిట్స్‌లో హాట్ ఫోటోషూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో “చాంగురే బంగారురాజా” సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

Kushitha Kallapu Hot photoshoots wiral on instagram

వరుస సినిమాలు చేస్తూ బిజీ!

ఇక ఛాంగురే బంగారు రాజా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కుషిత కల్లపు, ఈ సినిమా తర్వాత “మనోహరం”, “నీతోనే నేను” వంటి చిత్రాల్లో నటించి, తన ప్రతిభను చాటుకుంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “బాబు నెంబర్ వన్ బుల్ షిట్” సినిమాలో కూడా కుషిత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలతో పాటు, కుషిత ఇంకా మంచి అవకాశాలను అందుకుంటోంది. తన గ్లామర్ షోతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా ఈ భామ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా కుషిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. తెలుగు కుర్రాళ్ళకి మతులు పోతాయని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

చీర లో అందాల రచ్చ..

ఇక లేటెస్ట్ గా కుషిత కల్లపు (Kushitha Kallapu) ఇంస్టాగ్రామ్ లో చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది. ఆ ఫొటోలలో అమ్మడు ఎర్రని చీరలో చాలా అందంగా దర్శనమిస్తూ తన నవ్వుతోనే మాయ చేస్తోంది. వివిధ రకాల ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు కూడా ఆమెకు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగమ్మాయిలు కూడా విభిన్నమైన తరహాలో ఆకట్టుకుంటారు అని కుషిత తనదైన ముద్ర వేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా, కుషిత తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా గ్లామర్ షోతో పాటు, నటనలోనూ రాణించి, కుషిత తెలుగమ్మాయిలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు