Prabhas at Kalki Event: ఆ అమ్మాయిల కోసమే పెళ్ళి చేసుకోలేదు

Prabhas at Kalki Event: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఒకరు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రీసెంట్ టైమ్స్ లో శర్వానంద్ కూడా ఒక ఇంటివాడు అయిపోయాడు. కరోనా టైంలో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే యంగ్ హీరోస్ అంతా కూడా ఒకేసారి చాలా తక్కువ మందిని పిలిచి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు.

కృతిసనన్ తో గాసిప్స్

అయితే ఇదివరకే ప్రభాస్ పెళ్లి గురించి ఆల్రెడీ కొన్ని వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆది పురుష్ సినిమా చేస్తున్న సమయంలో కృతి సనన్ తో కూడా పెళ్లి పీటలేకపోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఒకానొక సందర్భంలో ప్రభాస్ అనుష్క కూడా పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ మాత్రం తన పెళ్లి విషయం ఎప్పుడు చెప్పలేదు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని పెట్టాడు ప్రభాస్.

Prabhas at Kalki Event: He didn't get married just for those girls
Prabhas at Kalki Event: He didn’t get married just for those girls

ఆ అమ్మాయిల కోసమే పెళ్ళి చేసుకోలేదు

ప్రభాస్ పెట్టిన స్టోరీని బట్టి చూస్తే ప్రభాస్ లైఫ్ లోకి ఏదో అమ్మాయి వస్తుంది అని అందరూ అనుకున్నారు. చాలామంది కథనాలు కూడా రాయటం మొదలు పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రాజెక్ట్ కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆ పోస్టు పెట్టాడు ప్రభాస్. ఇకపోతే దాని గురించి మరోసారి బుజ్జి ఈవెంట్లో ప్రస్తావని తీసుకొచ్చింది యాంకర్ సుమ. మీరు అలా స్టోరీ పెట్టగానే ఎంత మంది అమ్మాయిలా గుండె పగిలిపోయిందో అనే సుమ మాటలకు సమాధానంగా, అంతమంది అమ్మాయిలు బాధపడతారని చెప్పే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ ప్రభాస్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు