Goodachari2 : గూఢచారితో విభేదాలకు చెక్ పెట్టిన శశికిరణ్ తిక్క..

Goodachari2 : టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలే కాదు, మీడియం రేంజ్, చిన్న సినిమాలు కూడా అదరగొడుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ కూడా కంటెంట్ బాగుంటే ఏ సినిమాకైనా ఎగబడుతున్నారు. ఇక టైర్ 2 హీరోల్లో ఒకరైన అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ బిగినింగ్ నుండి కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇక ఏడాదిన్నర కింద హిట్ 2 తో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం గూఢచారి 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అడివి శేష్‌ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా అడవి శేష్‌ హీరోగా కొనసాగుతూ ఉన్న ఈ సినిమాకు దర్శకుడు మాత్రం మారడం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. గూఢచారి సినిమా ను శశి కిరణ్ తిక్క అద్భుతంగా రూపొందించాడు. అయినా కూడా ఎందుకు సీక్వెల్‌ కు, ఆయన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేశారు అనేది చాలా మంది ప్రశ్న. అసలు విషయం ఏంటి అనేది ఇన్నాళ్లు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు దర్శకుడు శశి కిరణ్ తిక్క స్పందించాడు.

Sashi Kiran Thikka gave clarity about Goodachari 2 movie

డేట్లు కుదరకే తప్పుకున్నా – శశి కిరణ్..

ఇక దర్శకుడు శశికిరణ్ తిక్క లేటెస్ట్ గా తాను దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ వారంలో విడుదల అవ్వబోతుండగా, ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు ప్రమోషన్ల కోసం వచ్చాడు. ఈ క్రమంలో తాను గూఢచారి సినిమా సీక్వెల్‌ కు దూరంగా ఉండటానికి కారణం ఏంటి అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. శశికిరణ్ మాట్లాడుతూ.. అడివి శేష్‌ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు. తాను ఉన్న బిజీ కారణంగా, మరియు ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ న్యాయం చేస్తాడు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గూఢచారి సీక్వెల్‌ అనుకున్న సమయంలో తాను సత్యభామ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్‌ కు కమిట్‌ అయ్యి ఉండటం వల్ల తనకు సాధ్యం అవ్వలేదని శశి కిరణ్ చెప్పుకొచ్చాడు. ఇక గూఢచారి సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన వినయ్‌ కుమార్‌ ప్రతి విషయంలో చక్కని అవగాహణ ఉంది. నేను తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసినా కూడా వినయ్ గూఢచారి సినిమా గురించిన ప్రతి విషయాన్ని, ప్రతి షాట్‌ ను గురించి చెప్పేవాడు. గూఢచారి ప్రపంచం మొత్తం అతడికి బాగా తెలుసు. అందుకే నేను మరియు శేష్‌ కలిసి సీక్వెల్‌ కు వినయ్‌ కుమార్ అయితే న్యాయం చేయగలడు అని భావించాం. అందుకే అతడితో సీక్వెల్‌ ను చేయిస్తున్నట్లుగా దర్శకుడు శశి కిరణ్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

G2 వెయిటింగ్..

మొత్తానికి గూఢచారి 2 (Goodachari2) సినిమా గురించి వస్తున్న పుకార్లకు శశి కిరణ్‌ ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి అభిషేక్‌ అగర్వాల్‌ మరియు అనిల్ సుంకర లు గూఢచారి2 సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అడవి శేష్ కొన్నాళ్ళు షూటింగ్ కి గ్యాప్ తీసుకోగా త్వరలోనే మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే గూఢచారి స్పెషల్ టీజర్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు