Kajal: గొడవ వస్తే నేనే హాగ్ చేసుకుని సారీ చెప్తా

Kajal: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోలతో సహా నటించింది. అయితే కాజల్ కెరియర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మగధీర. ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది కాజల్. ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

ఇకపోతే పెళ్లి చేసుకుని సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చింది కాజల్. అయితే మళ్లీ సినిమాలకి సత్యభామ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. శశి కిరణ్ తిక్క ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. సుమన్ చిక్కలా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. కాజల్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది కాజల్.

Kajal Aggarwal's husband Gautam Kitchlu

- Advertisement -

హగ్ చేసుకుని సారీ చెప్తాను

ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీ ఇంట్లో గొడవ అయితే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు.? అని ఒక యాంకర్ ప్రశ్నకు మా ఇంట్లో హస్బెండ్ తో గొడవ అయితే నేనే ముందుగా వెళ్లి తనను హగ్ చేసుకుని సారీ చెప్తాను. అంటూ చెప్పుకొచ్చింది కాజల్. అయితే మామూలుగా కాజల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ సెలబ్రిటీలకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితం ముందు మన స్థాయి, సాధించిన స్టేటస్ అవన్నీ అక్కడికి క్యారీ అవ్వవు. ఎంత మహా గనుడైన అమ్మఒడి పసివాడే అని బాహుబలి సినిమాలో పాటలా.. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా తన హస్బెండ్ కి మాత్రం మాములే భార్యే కాబట్టి, సారీ చెప్పడంలో తప్పులేదు అని కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు