Mahesh Babu’s new Look : జక్కన్న కు షాక్..‌. మళ్లీ SSMB29 లుక్ లీక్ చేసిన మహేష్

Mahesh Babu’s new Look : సూపర్ స్టార్ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో వన్ మ్యాన్ షో తో గట్టెక్కించి ఊపుమీదున్నాడు. ఇక ప్రస్తుతం అభిమానుల కళ్ళు మొత్తం రాజమౌళి – మహేష్ సినిమాపైనే ఉంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మొదలవుతుంది. ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ పై ఒక్క విషయం తెలియకున్నా, కేవలం కాంబో పైనే ఓ రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు SSMB29 కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu’s new Look) కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా కొత్త గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తొలిసారిగా ఈ సినిమాకోసం మహేష్ బాబు గడ్డం పెంచుతున్నట్టు సమాచారం. అయితే రాజమౌళి సినిమా అంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తారో తెలిసిందే. సినిమా కి సంబంధించిన స్టోరీ విషయంలోగాని, నటీనటుల గెటప్స్ విషయంలోగాని చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. కానీ మహేష్ బాబు జక్కన్న రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు.

Mahesh Babu's new Look For SSMB29 movie

మళ్ళీ లుక్ లీక చేసిన మహేష్…

ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం సరికొత్త లుక్ ని మైంటైన్ చేస్తుండగా, SSMB29 సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్ ఓ కనిపించనుండగా, గడ్డం కూడా పెంచుతున్నాడు. అయితే ఐతే, తాజాగా మహేష్ కొత్త లుక్ ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తోంది. మహేష్ బాబు ఈ పిక్ ను పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ పోస్ట్ కి లక్షల లైక్‌ లు వచ్చాయి. తన కుమారుడు గౌతమ్ కాన్వకేషన్‌కు హాజరైన మహేష్, తన కొడుకుతో కలిసి ఈ ఫోటో దిగాడు. మొత్తానికి ఈ లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు పొడవాటి జుట్టు మరియు మందపాటి గడ్డంతో కనిపించి షాక్ ఇచ్చాడు. రాజమౌళి సినిమాలో మహేష్ ఇదే లుక్‌ లో కనిపిస్తాడని మరోసారి రివీల్ అయిపొయింది.

- Advertisement -

కానీ రాజమౌళి మాత్రమే ఇలా లుక్స్ రివీల్ చేయడంలో అసంతృప్తిగా ఉన్నాడని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమాకి హైప్ పెంచడానికి వాడే మొట్ట మొదటి ప్రమోషన్, ఫస్ట్ లుక్. కానీ మహేష్ ఆ ఆసక్తిని తగ్గిస్తున్నాడు. ఏది ఏమైనా మహేష్ బాబు లీక్ చేసిన ఈ లుక్ తో జక్కన్న షాక్ అయ్యాడని అంటున్నారు నెటిజన్లు. ఇంతకు ముందు కూడా పలుమార్లు మహేష్ బాబు తన లుక్ ని లీక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా లీక్ చేయడంతో జక్కన్న ఏమి చేయలేని పరిస్థితి. ఇటు నెటిజన్లు మాత్రం తొందరగా సినిమా మొదలుపెట్టేస్తే… మంచిదని, ఏళ్లకు ఏళ్ళు వెయిట్ చేయలేమని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

గౌతమ్ కోసం షేర్ చేసిన మహేష్..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొడుకుని చూసి గర్వపడుతున్నాడు. గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికన్ యూనివర్సిటీలో చదువుకుంటుండగా, తాజాగా తన గ్రాడ్యుయేషన్ డే లో ఇలా సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక తన కొడుకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు మహేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ పోస్ట్ చేసాడు మహేష్. ఇక మహేష్ చేసిన పోస్ట్ లో “గర్వంతో నా హృదయం నిండిపోయింది.. కంగ్రాట్స్ గౌతమ్.. మున్ముందు కూడా ఇలానే ఎదుగుతూ ఉంటావ్ అని నాకు తెలుసు.. నీ కలల్ని వెంటాడుతూనే ఉండు.. నేను తండ్రిగా ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాను” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్ చేసాడు. ఇక మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ బాబు కొత్త లుక్‌లో ఫుల్ ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా కోసమే ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పేశాడు. ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్తారని మాత్రం అందరూ అనుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు