Kajal Agarwal : సత్యభామ కోసం మరో స్టార్ హీరో?

Kajal Agarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాస్ట్ ఇయర్ ‘భగవంత్ కేసరి’ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉంది. ఇక ఈ ఏడాది ‘సత్యభామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా “సత్యభామ” మూవీ తెరకెక్కగా, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చాడన్న విషయం తెలిసిందే. ఇక సుమన్ చిక్కాల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శశికిరణ్ ఈ సినిమాకి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక సత్యభామ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ కథాంశం ఉండబోతోందని సమాచారం. ఇక పలు వాయిదాల అనంతరం సత్యభామ ఫైనల్ గా జూన్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక సత్యభామ చిత్రాన్ని వీలైనంతగా జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి కాజల్ అగర్వాల్ స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఇండస్ట్రీ లో తన పరిచయాలని కూడా ఉపయోగిస్తోంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కాజల్ అగర్వాల్ జతకట్టిన విషయం తెలిసిందే. వీరందరితోనూ కాజల్ (Kajal Agarwal) కి మంచి బాండింగ్ ఉంది. ఇక ఇప్పటికే సత్యభామ ప్రమోషన్ కోసం బాలయ్యని దింపగా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ని ప్రమోషన్ కోసం పిలుస్తుందని తాజా సమాచారం.

Kajal Aggarwal's 'Satyabhama' movie pre-release event with Ram Charan as guest

సత్యభామ కోసం గ్లోబల్ స్టార్..

ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సత్యభామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని గెస్ట్ గా ఆహ్వానించేందుకు చిత్ర యూనిట్ కాజల్ చేత సంప్రదింపులు చేసారని టాక్ నడుస్తుంది. ఇక కెరియర్ ఆరంభంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా “మగధీర” చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ ఇద్దరిని స్టార్స్ గా మార్చింది. ఇక మగధీర నుంచి చరణ్ తో కాజల్ అగర్వాల్ కి మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కలిసి నటించడం జరిగింది. రెండేళ్ల కింద ఆశ్చర్యంలో కాజల్ నటించినా, స్క్రిప్ట్ ఛేంజ్ వల్ల తన పాత్రనే తీసేసారు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ని సత్యభామ కోసం ఈవెంట్ కి రప్పించడానికి సంప్రదిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ఆనాటి ఫ్యాన్స్ ని ఫోకస్ చేస్తున్నారుగా..

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) సత్యభామ మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ రాబోతున్నాడంట. కాజల్ అగర్వాల్ రిక్వెస్ట్ మేరకు ఆమెకి సపోర్ట్ గా నిలబడటానికి చరణ్ సత్యభామ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక వేళ చరణ్ ఈ ఈవెంట్ కి వస్తే మాత్రం సత్యభామ సినిమాకి ఖచ్చితంగా అది ప్లస్ అవుతుంది. ఇక ఇప్పటికే బాలయ్య ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా నందమూరి ఫ్యాన్స్ ని కాజల్ అగర్వాల్ మెప్పించింది. వారు సత్యభామ మూవీ చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తే మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై దృష్టి పెట్టె ఛాన్స్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాతో కాజల్ హిట్ కొడితే వరుసగా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేయడం ఖాయమని చెప్పొచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు