Ram Charan : మళ్లీ వార్తల్లో ఆ వెర్సటైల్ డైరెక్టర్-చరణ్ కాంబో మూవీ?

Ram Charan : టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. RRR తర్వాత రామ్ చరణ్ తన ఫోకస్ అంతా గేమ్ ఛేంజర్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇక పుష్ప2 రిలీజ్ అయ్యాక సుకుమార్ కూడా ఫ్రీ అవుతాడు కాబట్టి, వెంటనే రామ్ చరణ్ సుక్కూ తో కూడా సినిమా మొదలు పెట్టి, రెండూ ఒకేసారి షూట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ తో మరో డైరెక్టర్ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతనెవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్. ఇదిలా ఉండగా, సౌత్ ఇండస్ట్రీలో కల్ట్ అండ్ రా కంటెంట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్న దర్శకుల్లో ముందుగా వెట్రిమారన్ పేరు చెబుతారు జనాలు. వెట్రిమారన్ అంటే “ఆడుకాలం”, “విసారణై”, “వడచెన్నై”, “అసురన్”, “విడుతలై” లాంటి రియలిస్టిక్ సినిమాలు గుర్తుకొస్తాయి. రియల్ లైఫ్ సంఘటనలని, సమాజంలో బడుగు బలహీన వర్గాల సంఘర్షణని వెట్రిమారన్ తన సినిమాలతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. అందుకే అతని సినిమాలకి ఓ ప్రత్యేకత ఉంటుంది. కల్ట్ కంటెంట్ ని తెరపై ఆవిష్కరించడంలో వెట్రిమారన్ ని మించిన దర్శకులు లేరని సినీ విశ్లేషకులు సైతం అంటుంటారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Ram Charan Vetri Maran combo movie news

మూడేళ్ళ కింద వైరల్… ఇప్పుడు మళ్ళీ..

ఇక వెట్రిమారన్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలని వెట్రిమారన్ అనుకుంటున్నారు. గతంలో తారక్ కి ఓ స్క్రిప్ట్ వినిపించారు. వెట్రిమారన్ కూడా పలు ఇంటర్వ్యూలలో తారక్ తో మూవీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని కూడా అన్నారు. కానీ ఎందుకనో వెట్రి, తారక్ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇక మూడేళ్ళ కింద RRR కూడా రిలీజ్ కానీ టైం లో వెట్రిమారన్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుందని కోలీవుడ్ నెట్టింట ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ న్యూస్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ చరణ్ తో సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వెట్రిమారన్ ని రీసెంట్ గా రామ్ చరణ్ మీట్ అయ్యారట. ఇద్దరు ఓ స్క్రిప్ట్ పైన డిస్కస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వెట్రిమారన్ చెప్పిన స్టోరీ రామ్ చరణ్ కి బాగా నచ్చిందనే ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అటు వెట్రిమారన్ వైపు నుంచి గాని, ఇటు రామ్ చరణ్ వైపు నుంచి గాని ఎలాంటి స్పష్టత లేదు.

- Advertisement -

సెట్ అయితే కల్ట్ సినిమా రెడీ?

అయితే రామ్ చరణ్ – వెట్రిమారన్ కాంబోలో సినిమా వస్తే అది ఖచ్చితంగా రంగస్థలం మించిన మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. దాని తర్వాత వెట్రిమారన్ మూవీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఇక వెట్రిమారన్ ప్రస్తుతం తమిళంలో విడుతలై పార్ట్ 2 చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరి వీరి కాంబోలో మూవీ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు