Ram Pothineni : లిమిట్స్ దాటిపోయిన డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్.. అయినా డోంట్ కేర్?

Ram Pothineni : టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా అభిమానుల క్రేజ్ ని సంపాదించిన రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ గా అభిమానులని మెప్పించాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఊర మాస్ కమర్షియల్ సినిమాగా వచ్చి థియేటర్లలో దుమ్ములేపింది. అన్ సీజన్లో రిలీజ్ అయినా కూడా ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టించి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సూపర్ కం బ్యాక్ ని ఇచ్చింది. ఇప్పుడు అదే కాంబోలో మళ్ళీ దానికి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” (Double Ismart) వస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి ఊరిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ ని అనుకున్నంత కొత్తగా చూపించలేదని చాలా మంది అభిప్రాయం. అయితే పూరి సినిమాలు రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేకున్నా, రిలీజ్ తర్వాత మంచి కలెక్షన్లు వసూలు చేస్తాయి. అలాగే ఈ సినిమా కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు. ఇక చాలా సార్లు ఈ సినిమాతో డబుల్ ట్రీట్ ఇస్తామని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడని తెలిసిందే.

'Ram Pothineni' double smart movie has crossed the budget limits

లిమిట్స్ దాటిన బడ్జెట్..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్లే టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి ఉండాల్సింది, కానీ సినిమా పోస్ట్ పోన్ అయ్యి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా, మరోసారి మాస్ కంటెంట్ తో హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమా మొత్తం ఉండబోతుంది అని టీజర్ చూస్తె క్లారిటీ వచ్చేయగా మొదటి పార్ట్ రేంజ్ లో ఉన్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ రికార్డులను సైతం అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా కన్నా ముందు పూరీ జగన్నాథ్ మరియు రామ్ లు ఇద్దరికీ కూడా ఫ్లాఫ్స్ పడగా, ఆ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడుతుంది అనిపిస్తుంది. అయితే ఈ సారి భారీ బడ్జెట్ తో సీక్వెల్ రూపొందుతుంది అని అంటున్నారు. ఆల్ మోస్ట్ సినిమా కోసం ఇప్పుడు 70-80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు.

- Advertisement -

బడ్జెట్ పెరిగినా డోంట్ కేర్ అంటున్న పూరి..

అయితే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ ల కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మిగిలిన బడ్జెట్ లో సినిమా ప్రొడక్షన్ మొత్తం జరిగింది అని అంటున్నారు. పూరి ఓన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్నఈ సినిమా, ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కినా కూడా చాలా వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకి అమ్మారని అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి జోరు చూపించే అవకాశం ఉండగా అంచనాలను కనుక సినిమా అందుకుంటే ఖచ్చితంగా మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కానీ అదే విధంగా ప్లాప్ టాక్ అందుకున్నా భారీ నష్టాలూ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా అంతా పూరి చేతుల్లోనే ఉందంటున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు