Anjali: గేమ్ ఛేంజర్ పై అప్డేట్ ఇచ్చిన తెలుగమ్మాయి.. విధ్వంసమే .!

Anjali.. ప్రముఖ తెలుగు హీరోయిన్ అంజలి తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు.. కానీ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అక్కడ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అడపా దడపా తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ అనే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇది వరకే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వదిలింది అంజలి.

ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ కి జోడీగా అంజలి..

శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలయ్యి మూడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు.. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్న లీక్స్ తప్ప.. సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్ రాలేదు.. అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలే ఉంది కానీ ఈ సంవత్సరం ఎలాగైనా సరే రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి ఇప్పటికే లీకైన ఫోటోలతో ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరసన కనిపిస్తోందని మనకు అర్థమవుతుంది. తాజాగా అంజలి గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి మాట్లాడింది.

గేమ్ ఛేంజర్ మూవీ పై అంజలి అప్డేట్..

Anjali: Tollywood beauty gave an update on the game changer.
Anjali: Tollywood beauty gave an update on the game changer.

ఈ సినిమా గురించి అంజలి మాట్లాడుతూ.. ఇంకా షూటింగ్ కొంచెం మిగిలే ఉంది.. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది.. చరణ్ తో కలిసి నేను ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాను ..అంతే కాదు మా ఇద్దరికీ ఒక సాంగ్ కూడా ఉంది.. నేను ఇందులో హీరోయిన్ గానే నటిస్తున్నాను.. కీ రోల్ కాదు అంటూ ఆమె తెలిపింది. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే ఇవ్వమని మీడియా ప్రతినిధులు ఆమెను అడగ్గా.. దిల్ రాజు, శంకర్ చెప్పకుండా మేము ఏ విషయం మీడియాతో చెప్పకూడదు అంటూ క్లారిటీ ఇచ్చింది అంజలి..

- Advertisement -

రామ్ చరణ్ పై ప్రశంసలు..

అలాగే రామ్ చరణ్ మంచి వ్యక్తి అని.. నటనలో 100% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అని చరణ్ గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడింది అంజలి.. ఇక దీంతో గేమ్ ఛేంజర్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని క్లారిటీ అయితే వచ్చేసిందని చెప్పవచ్చు.

ఆలస్యం అవ్వడానికి కారణం..

ఇకపోతే ఈ సినిమా ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం శంకర్.. మరోవైపు కోలీవుడ్లో కమలహాసన్ తో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.. ఇప్పుడు ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కాబోతోంది.. ఈ నేపథ్యంలోనే ఇక తన పూర్తి సమయాన్ని గేమ్ ఛేంజర్ సినిమా కోసం కేటాయించబోతున్నారు శంకర్.. ఇక ఈ ఏడాదే విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు