Kriti Sanon : ప్రభాస్ తో లవ్ ట్రాక్ పై క్లారిటీ

గత కొద్ది కాలంగా బాలీవుడ్ నుండి – టాలీవుడ్ వరకు ఒకటే హాట్ న్యూస్ అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్యన సంథింగ్ సంథింగ్ అనే వార్త. అయితే సినీ రంగంలో హీరో, హీరోయిన్లపై పుకార్లు కామన్. ఇక స్టార్ హీరో అయితే ఇంకా జోరుగా సాగుతాయి. ఈ క్రమంలో ప్రభాస్, కృతి సనన్ పై ఈ మధ్యకాలంలో చాలా పుకార్లు వచ్చాయి. వీటికి తోడు ఓ సందర్భంలో కృతి… ప్రభాస్ తో నేను పెళ్ళికి రెడీ అంటూ సంచలనం సృష్టించింది.

మరోవైపు ఈ మధ్యన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఔషోలో చేసిన కామెంట్స్ వీటిని మరింత బలపరిచాయి. ప్రభాస్ ని వరుణ్ ధావన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. “కృతి మనసులో ఒకరున్నారు.. అతను ప్రస్తుతం దీపికా పదుకొన్ తో షూటింగ్ లో ఉన్నాడు” అని కామెంట్ చేశాడు. కాగా దీపికా పదుకొన్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ కె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య రిలేషన్ నిజమే అని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.

ఈ రూమర్లపై తాజాగా కృతి సనన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించింది. ఇటువంటి బేస్ లెస్ రూమర్స్ ని నమ్మవద్దని స్పష్టం చేసింది. వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేస్తున్నారని.. దయచేసి ఇటువంటి ప్రచారం చేయవద్దని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కృతి పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు