Keerthy Suresh: అసభ్యకరంగా టచ్ చేసిన తాగుబోతు… ఊహించని పని చేసిన కీర్తి

Keerthy Suresh

సెలబ్రిటీ అనగానే ఎగ్జైట్మెంట్ పెరిగిపోయి హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు కొంతమంది. ఇప్పటిదాకా స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ కాకముందే కీర్తి సురేష్ జీవితంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందట. కావాలని తనను టచ్ చేసిన తాగుబోతుకు జన్మలో మర్చిపోలేని ట్రీట్మెంట్ ఇచ్చిందట కీర్తి సురేష్. ఇంతకూ ఆమె ఏం చేసింది? ఆ స్టోరీ ఏంటి? అంటే…

“మహానటి” సినిమా తర్వాత నేషనల్ స్టార్ గా మారిపోయిన కీర్తి సురేష్ సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే “మహానటి” తర్వాత ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ కంటే డిజాస్టర్లే ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది “దసరా” సినిమాలో డిగ్లామర్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “దసరా” సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పుడు “సైరన్” అంటూ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కీర్తి సురేష్. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో జయం రవి హీరోగా నటిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఫిబ్రవరి 16న “సైరన్” మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

ఈ మేరకు కీర్తి సురేష్ మాట్లాడుతూ తాను నటిగా పరిచయం కాకముందే ఒకరోజు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన విషయాన్ని, ఆరోజు జరిగిన అనూహ్య సంఘటన గురించి చెప్పుకొచ్చింది. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడిందని, అయితే ఆ సమయంలో తను తన ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నానని గుర్తు చేసుకుంది. అయితే అదే సమయంలో బాగా తాగేసి ఉన్న ఓ వ్యక్తి అటుగా నడుస్తూ వచ్చాడని, తన వెనకాలకు రాగానే తాకుతూ ముందుకు వెళ్లాడని వెల్లడించింది. అతను కావాలని తాకాడనే విషయం అర్థం కాగానే పట్టరానంత కోపం వచ్చి చెంప చెల్లుమనిపించిందట కీర్తి సురేష్.

- Advertisement -

ఆ తర్వాత అతను కూడా ఈ హీరోయిన్ పై దాడి చేశాడట. ఆ సమయంలో తలపై దెబ్బ తగిలిందనే షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది కీర్తి. అయితే అక్కడితో ఆ విషయాన్ని వదిలేయకుండా తాను తన స్నేహితులతో కలిసి అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించామని చెప్పింది. అనంతరం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, అతడిని ఆ రోజు రాత్రి అంతా జైల్లోనే ఉంచి ఉదయం వదిలిపెట్టారని తన జీవితంలో ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని బయట పెట్టింది. స్క్రీన్ పై సాఫ్ట్ గా కనిపించే తనలో ఇలాంటి మాస్ యాంగిల్ కూడా ఉందని చెప్పుకొచ్చింది కీర్తి. ఏదేమైనా అలాంటి సమయంలో ఆమె వ్యవహరించిన తీరుకు, గట్స్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు అభిమానులు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు