NTR : ఆలస్యం అందుకే..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తో సూపర్ హిట్ అందుకున్న తారక్, ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 30 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ గ్లిమ్స్ వచ్చింది. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానులకు ఓ రేంజ్ లో హైపును ఇచ్చింది.

ఈ సినిమా ప్రకటించి రోజులు గడుస్తున్న పట్టాలెక్కడం లేదు. ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో బయ్యర్లు నిండా మునిగిపోయారు. ఈ మూవీ ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చిన కొరటాల అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ సమస్యల నుంచి కొరటాల బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఆచార్య ఫలితం నేపథ్యంలో ఎన్టీఆర్30 స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసే పనిలో ఉన్నారు కొరటాల శివ.

దీంతో పాటు ఎన్టీఆర్30 షూటింగ్ వాయిదా పడటానికి మరో కారణం ఉందని సమాచరం అందుతుంది. ఆ కారణం ఏంటంటే, తారక్ ఒక సమస్యతో బాధపడుతున్నాడట. భుజం నొప్పితో ఇబ్బంది ఎన్టీఆర్ గత కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. బింబిసార ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ నొప్పితోనే హాజరయ్యారట. అయితే ప్రస్తుతం ఈ నొప్పి తీవ్రమైందని, దీంతో డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. దీని వల్లే ఎన్టీఆర్ 30 షూటింగ్ వాయిదా పడుతుందని తెలుస్తుంది. కాగా ఈ సంవత్సరం అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో 2023 చివరలో గానీ, 2024 ప్రారంభంలో గానీ ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు