HBD Raviteja: రవితేజ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

HBD Raviteja:  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి సపోర్టు లేకుండా అడుగుపెట్టి స్వసక్తితో ఎదిగిన వారిలో రవితేజ కూడా ఒకరు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో అరంగేట్రం చేసిన ఈయన తన మేనరిజంతో బడా దర్శకులను ఆకర్షించి హీరోగా ఎదిగి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

రవితేజ పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు.. 1968 జనవరి 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన ఈయన చిన్ననాటి నుండి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.ఆ ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలదొక్కుకున్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

కర్తవ్యం సినిమాతో తెరంగేట్రం చేసిన రవితేజ చైతన్య, అల్లరి ప్రియుడు లాంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న రవితేజ కి నీకోసం సినిమాలో అవకాశం వచ్చింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించిన రవితేజాకి మాత్రం నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించడం గమనార్హం. ఇక తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఈయనకి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో మరోసారి సోలో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రవితేజ ఖాతాలో మొదటి సక్సెస్ గా నిలిచింది.

- Advertisement -

ఇక ఇడియట్ సినిమాతో ఆయన మళ్ళీ వెను తిరిగి చూసుకోలేదు. రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకులలో కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్ ప్రథమ స్థానంలో ఉంటారనటంలో సందేహం లేదు. ఇక ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు రవితేజ. ఇక త్వరలోనే ఈగల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు