Prashanth Varma : “హనుమాన్” 2 డేస్ కలెక్షన్స్… సాలిడ్ హోల్డ్..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” ఒకటి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకోగా, ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అన్ని అంచనాలను మించిపోయి సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా 13.27 కోట్లకి పైగా షేర్ సాధించింది. మీడియం రేంజ్ సినిమాల్లో, అదీ లిమిటెడ్ స్క్రీన్ లలో కూడా సూపర్ కలెక్షన్లు అని చెప్పొచ్చు.

ఇక రెండో రోజు కూడా హనుమాన్ సూపర్ హోల్డ్ ని సాధించడం విశేషం. ఫస్ట్ డే కి ఏమాత్రం తగ్గని విధంగా వసూళ్ళని సాధించిన హనుమాన్, తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక హిందీలో మొదటి రోజుని మించి డబుల్ మార్జిన్ లో గ్రోత్ చూపించి భారీ కలెక్షన్లు వసూలు చేసింది హనుమాన్. హిందీ వెర్ష న్ ఫస్ట్ డే 2.15 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, రెండో రోజు 4.05 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక హనుమాన్ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 10. 81 కోట్ల షేర్ ని 20.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం జరిగింది. ఇక హనుమాన్ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 24.58 కోట్ల షేర్, 45.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం హాలిడే అడ్వాంటేజ్ తో సాలిడ్ గ్రోత్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. అయితే వరల్డ్ వైడ్ గా హనుమాన్ 31 కోట్ల బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 6 కోట్లు వసూలుచేస్తే సరిపోతుంది. ఇక మూడో రోజు కలెక్షన్లతో ఈజీ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు